New Ration Card : కొత్త రేషన్ కార్డ్ కావాలనుకునే వారికి శుభవార్త..!
ప్రధానాంశాలు:
New Ration Card : కొత్త రేషన్ కార్డ్ కావాలనుకునే వారికి శుభవార్త..!
New Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అలాంటి వారికి బిగ్ రిలీఫ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. బియ్యం కార్డుల్లో కొత్తగా పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

New Ration Card : కొత్త రేషన్ కార్డ్ కావాలనుకునే వారికి శుభవార్త..!
New Ration Card మంచి వార్త..
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకునే వారికి పెళ్లి కార్డు అడగటం అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు.ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు అవసరం లేదని ఈ మేరకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. అయితే భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్లు దాటినట్లయితే సింగిల్ మెంబర్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు .లబ్ధిదారులను దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకునే వారి కోసం గడువును పెంచే యోచనలో ఉన్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల ముందు జనాలు క్యూ కట్టారు. ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. అయితే కొత్త రేషన్‌కార్డుకు వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ తప్పనిసరి చేయడంతో పాటు గిరిజనుల్లో 80 శాతం మంది వివాహితులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ జరగలేదు.