Gudivada Constituency : తెలుగుదేశం పార్టీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన గుడివాడ వంటి నియోజకవర్గంన్ని ఈరోజు కొడాలి నాని వంటి వారు పాలించడం అనేది చంద్రబాబు నాయుడు వంటి వ్యక్తిki ఎప్పటికీ జీర్ణించుకోలేని అంశం అని చెప్పాలి. ఎందుకంటే మొదట్లో దీనిపై చాలా బాధపడ్డారు తర్వాత మధ్యలో వదిలేశారు ఇక ఇప్పుడు మళ్లీ ఆ నియోజకవర్గాన్ని పంతంగా తీసుకొని గెలిచి తీరాల్సిందే అనే ఆలోచనతో కొత్త ప్లాన్స్ ఉపయోగించే అవకాశాలు ఉన్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈసారి కచ్చితంగా గుడివాడ నియోజకవర్గం లో గెలిచి తీరుతామని ఛాలెంజ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు కొడాలి నానిని ఓడించాలంటే ముందుగా అసలు ఏం చేయాలనే దానిపై ఆలోచించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు అలా కాకుండా ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మారుస్తూ మిస్టేక్ చేస్తున్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఈసారి అలాంటి తప్పులు చంద్రబాబు నాయుడు చేయకూడదని ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గడిచినటువంటి నాలుగు ఎన్నికల్లో రెండుసార్లు టిడిపి తరఫునుండి మరో రెండు సార్లు వైసిపి పార్టీ తరఫునుండి గెలిచినటువంటి కొడాలి నాని ఐదోసారి గెలవడానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో చూడాలి నాని ని ఆపేదెలా అనే వాటిపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే వైసిపి సర్కార్ పై వ్యతిరేకత అలాగే కొడాలి నాని పై కాస్త వ్యతిరేకత ఉన్నటువంటి ఈ క్రమంలో గత ఎన్నికల్లో 20వేల మెజారిటీతో గెలిచిన కొడాలి నానిని ఓడించగలుగుతాము లేదా మెజారిటీ అయిన తగ్గించగలుగుతాము అనే దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గత ఎన్నికల్లో టిడిపి జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వలన కోడాలి నాని కు 20 వేల మెజార్టీ వచ్చిందని అంటున్నారు. ఇక 2014లో 11వేల మెజారిటీ వచ్చింది. ఇక ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ లో గుడివాడ గాలి మొత్తం టిడిపి జనసేన వైపే విస్తుందని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో గుడివాడ నుండి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఇప్పుడు మళ్లీ బరిలో దించేందుకు చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరి అభ్యర్థుల మధ్య చర్చ నడుస్తుంది అని చెప్పాలి. ఒకటి రావి వెంకటేశ్వరరావు రెండు వెనిగల రాము.
ఇక వీరిద్దరిలో రావి వెంకటేశ్వరరావు కి టికెట్ ఇవ్వాలి అని టిడిపి అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే క్యాడర్ మొత్తం కూడా కొత్త వ్యక్తులను అంగీకరించడం లేదు.కాబట్టి రావి వెంకటేశ్వరరావు గుడివాడ టికెట్టు ఇవ్వాలని అధిష్టానం చూస్తోంది. ఇక అదే జరిగితే ఆయన ద్వారా తెలుగుదేశం క్యాడర్ అంతా సక్రమంగా పనిచేస్తే కచ్చితంగా ఈసారి కొడాలి నాని కొడతాము అనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే సాధ్యమైతే కచ్చితంగా గుడివాడలో తెలుగుదేశం పార్టీ కొడాలి నాని దెబ్బతీసేటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ అంతా రావి వెంకటేశ్వరరావు ప్లానింగ్ ప్రకారం జరగాలని , అధినాయకత్వం ఎట్టి పరిస్థితుల్లోని మధ్యలో రాకూడదని ,రావి వెంకటేశ్వరరావు కోరుతున్నట్లు సమాచారం. మరి గుడివాడ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మీ రాజకీయ అనుభవంతోటి కామెంట్స్ లో తెలియజేయండి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.