YCP Leaders : జగన్ ను వీడి కూటమిలో చేరి తప్పు చేసారా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YCP Leaders : జగన్ ను వీడి కూటమిలో చేరి తప్పు చేసారా..?

 Authored By ramu | The Telugu News | Updated on :1 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  YCP Leaders : జగన్ ను వీడి కూటమిలో చేరి తప్పు చేసారా..?

  •  కూటమి వైసీపీ నేతలకు గుర్తింపు లేకుండా పోయిందా..?

  •  YCP Leaders : జగన్ ను వీడి కూటమిలో చేరి తప్పు చేసారా..?

YCP Leaders : జగన్ ను కాదని చెప్పి కూటమిలో చేరిన వైసీపీ నేతలు బాధలో ఉన్నారా..? అసలు ఎందుకు చేరమా అని ఆలోచనలో పడ్డారా..? ఈ దానికి చేరడం ఎందుకు అని వారి అభిమానులు ప్రశ్నిస్తున్నారా..? అంటే అవుననే చెప్పాలి. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాజయం తర్వాత, పలువురు కీలక నేతలు జగన్‌ను వీడి కూటమి పార్టీలను ఆశ్రయించారు. ముఖ్యంగా మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణలు తమ రాజీనామాలు సమర్పించి టీడీపీ-జనసేన కూటమిలో చేరారు. అయితే ఈ నేతలకు కొత్త పార్టీల్లో గౌరవం లేకపోవడం, వారిని ఆ పార్టీల కార్యకర్తలు అంతగా ఆదరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీరికి లభించిన ప్రాధాన్యత ప్రస్తుతం కనిపించకపోవడంతో వారు రాజకీయంగా ఒంటరి పోరాటం చేస్తున్నారు.

YCP Leaders జగన్ ను వీడి కూటమిలో చేరి తప్పు చేసారా

YCP Leaders : జగన్ ను వీడి కూటమిలో చేరి తప్పు చేసారా..?

YCP Leaders : కూటమి లో చేరిన వైసీపీ నేతలు కక్కలేక మింగలేక పోతున్నారా..?

బాలినేని జనసేనలో చేరినప్పటికీ, ఆయన్ని స్థానిక టీడీపీ నేతలు కలిసి పనిచేయటానికి ఆసక్తి చూపటం లేదు. అలానే, పార్టీ నుంచి ఎలాంటి పదవి కూడా ఇప్పటి వరకు ఆయనకు ఇవ్వలేదు. దీంతో తన వర్గాన్ని కాపాడుకునే పనిలో బాలినేని ఉన్నారు. అదే పరిస్థితి ఆళ్ల నానికీ ఎదురైంది. టీడీపీలో చేరినప్పటికీ ఏలూరు టీడీపీ నేతలు ఆయనను నాయకుడిగా ఒప్పుకోవడంలో ఆసక్తి చూపడంలేదు. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి నానికి అసహనం వ్యక్తమవుతోంది. పార్టీ కార్యాలయాలకు వెళ్లలేని స్థితిలో ఉన్న నానిని అనుచరులు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఇదే విధంగా, మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరినప్పటి నుంచి ఎలాంటి బాధ్యతలు లేక, పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించకపోవడం గమనార్హం.

ఇలా కూటమి పార్టీలో చేరిన ఈ మాజీ మంత్రులు, రాజకీయంగా దిక్కుతెలియని పరిస్థితిలో ఉన్నారు. వీరు ఎన్నికల ముందు జగన్ పార్టీని వీడి వెళ్ళినప్పటికీ, ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్లే అవకాశాలు లేకపోవచ్చు. వైసీపీ నేతలు తాము వీరికి ద్వారాలు మూసివేశామని స్పష్టంగా చెబుతున్నారు. అయితే నియోజకవర్గాల్లో మాత్రం వీరు తిరిగి వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత లేక, పార్టీలు మారిన తరువాత కూడా మద్దతు దక్కక, వీరు ఎటుపోతారో అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది