Roja Vs Nagababu : రోజా VS నాగబాబు.. రోజా మాటలకి పళ్ళు పగలగొడతా అన్న నాగబాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Roja Vs Nagababu : రోజా VS నాగబాబు.. రోజా మాటలకి పళ్ళు పగలగొడతా అన్న నాగబాబు..!

Roja Vs Nagababu : ఏపీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక అధికార పార్టీ వైఎస్సార్ సీపీని గద్దె దించడానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమదైన శైలిలో దూసుకెళుతున్నారు. మినిస్టర్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :9 February 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Roja Vs Nagababu : రోజా VS నాగబాబు.. రోజా మాటలకి పళ్ళు పగలగొడతా అన్న నాగబాబు..!

Roja Vs Nagababu : ఏపీ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక అధికార పార్టీ వైఎస్సార్ సీపీని గద్దె దించడానికి టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. మరోవైపు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తమదైన శైలిలో దూసుకెళుతున్నారు. మినిస్టర్ రోజా జనసేన , టీడీపీ పొత్తు పై తీవ్ర విమర్శలు చేశారు. ఇన్ డైరెక్ట్ గా నాగబాబుపై ఆమె కామెంట్స్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ వస్తున్నాయంటే సంక్రాంతికి డూడూ బసవన్నలు ఎలా వస్తారో అలా చాలామంది వస్తారు. ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు మూడో కృష్ణుడు ఇప్పుడూ నాలుగో కృష్ణుడు బయలుదేరాడు అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

వీళ్లంతా వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోయడానికి వస్తున్నారు తప్ప అధికారంలో వస్తే ఏం చేస్తారో ప్రజలకు చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎందుకంటే వాళ్లకు చేయాలన్న మంచి మనసు లేదు. కేవలం జగనన్నను ఓడించాలి అధికారంలోకి రావాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలకు ఏమి చేయాలో ఆలోచించుకుండా గుంపులు గుంపులుగా వస్తున్న ప్రతిపక్షాలను తరిమికొట్టాలని ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. ఇక నాగబాబు మాట్లాడుతూ.. ప్రజలకు న్యాయం చేయలేని, ప్రజలకు సదుపాయాలను అందించలేని ప్రభుత్వం ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి 2019లో వైఎస్సార్సీపీ అనే వైరస్ వచ్చింది. ఆ వైరస్ ను తొలగించడానికి జనసేన, టీడీపీ వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందని అన్నారు.

వైయస్సార్ సీపీని గద్దె దించడానికి కాదు ప్రజలకు జరిగిన అన్యాయం గురించి పోరాడాలి. టీడీపీ సభ్యులు ఎక్కడ పోటీ చేసిన వారికి జనసైనికులు సపోర్టుగా ఉండాలి. అలాగే జనసేన సభ్యులు ఎక్కడ పోటీ చేసిన వారికి టీడీపీ సపోర్టుగా నిలబడాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకొని ముందుకు వెళితే విజయాన్ని సాధించగలుగుతాం. పొత్తులో విభేదాలను రాకుండా దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఓడించాలి అని అన్నారు. వైసీపీ నాయకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతారు. ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటూ నోటికి అదుపు లేకుండా వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలాంటి వాళ్లను ఎన్నాళ్ళని భరిస్తాం. సామాన్య ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే వైసీపీ ప్రభుత్వం నశించాలి అని నాగబాబు చెప్పుకొచ్చారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది