YS Jagan NCLT : జగన్ కు భారీ ఊరట.. షర్మిల కు షాక్.. YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan NCLT : జగన్ కు భారీ ఊరట.. షర్మిల కు షాక్.. YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 July 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  అన్నకు రిలీఫ్..చెల్లికి షాక్..YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు

  •  YS Jagan NCLT : జగన్ కు భారీ ఊరట.. షర్మిల కు షాక్.. YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు..!

YS Jagan NCLT  : వైసీపీ YCP అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి  నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (NCLT) లో ఊరట లభించింది. తన పేరిట ఉన్న వాటాలను అక్రమంగా తల్లి వైఎస్ విజయమ్మ Ys Vijayamma మరియు చెల్లి వైఎస్ షర్మిల Ys Sharmila బదిలీ చేసుకున్నారని జగన్ వేసిన పిటిషన్‌ను NCLT పరిశీలించి, ఆయన వాదనలతో ఏకీభవించింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో వాటాల బదిలీకి సంబంధించి ఈ వివాదం చోటుచేసుకుంది.

YS Jagan NCLT జగన్ కు భారీ ఊరట షర్మిల కు షాక్ YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు

YS Jagan NCLT : జగన్ కు భారీ ఊరట.. షర్మిల కు షాక్.. YSR ఫ్యామిలీ లో సరికొత్త మలుపులు..!

YS Jagan NCLT  : జగన్ పిటిషన్ కు NCLT గ్రీన్ సిగ్నల్..

ఈ కేసులో NCLT సుదీర్ఘంగా విచారణ జరిపి, రెండు పక్షాల వాదనలు వినిపించింది. జగన్ వాదనలో తనతో పాటు భార్య వైఎస్ భారతికి చెందిన వాటాలను తన అనుమతి లేకుండా బదిలీ చేశారని, ఇది కంపెనీ చట్టాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ అంశంపై పేరు మార్పులు చట్టపరంగా చెల్లవని అభిప్రాయంతో NCLT ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనివల్ల జగన్‌కు న్యాయపరంగా విజయవంతమైన మద్దతు లభించినట్టయ్యింది.

అయితే ఈ తీర్పుపై వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందని సమాచారం. తల్లి-చెల్లి మధ్య వ్యక్తిగత సంబంధాలు రాజకీయ రంగును పూనుకోవడం, వ్యాపార పరమైన వివాదాలు కోర్టు మెట్లు ఎక్కడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఏ దిశగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది