YS Jagan Mohan Reddy : ఏపీలో హంగ్.. సీఎం ఎవరు? చంద్రబాబా.. జగనా? పెద్ద సమస్యే వచ్చి పడిందే?
ప్రధానాంశాలు:
టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది?
బీజేపీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది?
జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది?
YS Jagan Mohan Reddy : ఏపీలో వచ్చే ఎన్నికల్లో హంగ్ రాబోతోందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేనట్టుగా కనిపిస్తోంది. అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి హంగ్ కాకుండా ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ లేదు అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా స్పష్టమైన మెజారిటీ సాధించే అవకాశం లేదు. జనసేన, టీడీపీ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్స్ ఉంటుందా? అంటే లేదనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి తెలంగాణ ఎన్నికల్లో హంగ్ వస్తుందని అంతా భావించారు. కానీ.. అక్కడ పరిస్థితులు అన్నీ తారుమారయ్యాయి. ఇక ఏపీ విషయానికి వస్తే మాత్రం ఏపీలో ఖచ్చితంగా ఈసారి హంగ్ వస్తుందని అంటున్నారు. ఎందుకంటే.. ఈసారి బీజేపీకి కూడా కాస్తో కూస్తో అక్కడ సీట్లు వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కనీసం 10 సీట్లు గెలిచినా కూడా జనసేన కనీసం 40 నుంచి 50 సీట్లు గెలిచినా ఇక టీడీపీ, వైసీపీ మధ్య పోటీ 110 నుంచి 120 సీట్లకే ఉంటుంది.
ఏపీలో మొత్తం ఉన్న సీట్లు 175. అందులో మ్యాజిక్ ఫిగర్ 88. అంటే 110 సీట్లలో టీడీపీకి ఎన్నొస్తాయి.. వైసీపీకి ఎన్నొస్తాయి అనేదే పెద్ద డౌట్. టీడీపీకి ఒక 30 నుంచి 40 వరకు వచ్చినా.. వైసీపీకి 60 నుంచి 80 వరకే వస్తాయి. అంటే.. అటు టీడీపీ కానీ.. ఇటు వైసీపీ కానీ.. అటు జనసేన కానీ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు. ఎలాగూ టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ సీట్లు సరిపోకపోతే బీజేపీ ఎలాగూ ఉంది కాబట్టి బీజేపీ కూడా తన మద్దతు ఇస్తుంది కాబట్టి ఈ మూడు పార్టీలు కలిసి ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి.
YS Jagan Mohan Reddy : బీజేపీ, జనసేకు 35 సీట్లే ఇవ్వాలని అనుకుంటున్న చంద్రబాబు
ఒకవేళ టీడీపీ, జనసేన.. బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుంటే.. చంద్రబాబు మాత్రం 140 సీట్లలో ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటున్నారు. 140 సీట్లలో పోటీ చేసినా 80 సీట్లు కూడా గెలిచే చాన్స్ లేదు. మిగితా 35 సీట్లలో మాత్రమే జనసేన, బీజేపీ అభ్యర్థులకు చాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇది ఎంత మేరకు వర్కవుట్ అవుతుందో వేచి చూడాల్సిందే.