Chandrababu Naidu : పవన్ కళ్యాణ్‌తో పొత్త ప్రతిపాదన నేనే చేశా : చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు సాగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పొత్త ప్రతిపాదనన తానే చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. నందమూరి బాలక్రిష్ణ హోస్ట్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థ వారి అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా హాజరైన చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగిన ప్రతి ఒక్క నేత ఏదో ఒక విషయంలో జైలు జీవితం గడిపిన వారే. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఒక్కరే మినహాయింపుగా ఉండేవారు. మచ్చలేని నాయకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నారు. అయితే వైఎస్సాఆర్‌సీపీ ఎప్పుడైతే ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిందో చంద్రబాబు నాయుడుకు సైతం ఈ విషయంలో మినహాయింపు లేకుండా పోయింది.
చంద్రబాబును జైలుకు పంపించడమే కాకుండా ఆయనను ఏకంగా 53 రోజుల పాటు జైలు జీవితం గడిపేలా చేసింది. అది అక్రమ అరెస్ట్ అని టీడీపీ, ఇతర విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. బాబుని జైలుకు పంపించి వైసీపీ ఒకవిధంగా సెల్ఫ్ గోల్ వేసుకుందని అంతా భావించారు. ఆ సానుభూతిని తమకు అనుకూలంగా మలుచుకుంటూ టీడీపీ కూటమి కట్టి రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని కైవసం చేసుకుంది.
నాటి పరిస్థితులపై చంద్రబాబును బాలయ్య అడిగినప్పుడు బాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన జైలు జీవితం గురించి చంద్రబాబు చెబుతూ ఒక దశలో ఎమోషన్ కి గురయ్యారు. చేయని తప్పుకు తాను జైలుకు వెళ్లినట్లుగా తెలిపారు. నంద్యాలలో ఉండగా తనను అరెస్ట్ చేశారని రోజంతా తిప్పారని తన అరెస్ట్ గురించి నోటీసులు ఇవ్వలేదని అరెస్ట్ వారెంట్ తోనే అంతా చేశారన్నారు. అదంతా ఒక చేదు అనుభవం అని బాబు అన్నారు. తాను జైలులో ఉంటే ప్రజలు స్వచ్చందంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలియచేయడం గొప్ప అనుభూతి అని అన్నారు. ఆ ఘటనలు తలచుకుంటే తన గుండె తరుక్కుపోతుందన్నారు.
Chandrababu Naidu : పవన్ కళ్యాణ్‌తో పొత్త ప్రతిపాదన నేనే చేశా : చంద్రబాబు నాయుడు
మరో వైపు జైలులో ములాఖత్ కి వచ్చిన పవన్ తో తాను రెండు నిముషాలు మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. పొత్తు ప్రతిపాదనను తానే చేసినట్లు వెల్లడించారు. అయితే పవన్ ని ఆలోచించుకుని నిర్ణయం తీసుకోమని చెప్పానన్నారు. అయితే పవన్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జైలు బయటనే పొత్తు గురించి ప్రకటన చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత బీజేపీని కూడా ఒప్పిస్తానని చెప్పారన్నారు. తన జైలు జీవితం తర్వాత తొందరగా రాజకీయ పునరేకీకరణ సాగిందన్నారు. మొత్తానికి తాను రాజకీయంగా అన్ స్టాబబుల్ అని బాబు ప్రకటించారు.
Samantha : టాలీవుడ్లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
This website uses cookies.