YS Jagan : ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఈ సమావేశాలపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తోంది. అంతేకాకుండా పలు పనులపై కమిటీలు వేసి నిజనిజాలు బహిర్గతం చేస్తోంది. ఇదే సమయంలో ఆనాడు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసిన, నేతలపై అసభ్యకరంగా పోస్టులు చేసిన వారి భరతం పడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంతమంది ఎస్పీలు వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని ఘాటుగా స్పందించారు. దాని తర్వాత పోలీసుల తీరులో మార్పు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. నాటి ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైఎస్ జగన్ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే ఓటర్లు పరిమితం చేశారు.తొలి సమావేశాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హజరు అవుతారా ? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హజరు అయ్యే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తాము గళం ఎత్తుతామన్న భయంతోనే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం .. వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అటువంటప్పుడు సమావేశాలకు హజరవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హజరు కావడం లేదని స్పష్టీకరించారు. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని మరోసారి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న ఆందోళనతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరు అనే విషయం…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు భజన చేయడం చర్చనీయాంశంగా మారింది.గతంలో చంద్రబాబుని విమర్శించన వాళ్లు…
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిమితుల క్రింద…
KTR : హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…
Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…
Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం…
This website uses cookies.