YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ సమావేశాలు.. జ‌గ‌న్ వ‌స్తారా,రారా అనే దానిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ సమావేశాలు.. జ‌గ‌న్ వ‌స్తారా,రారా అనే దానిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 November 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ సమావేశాలు.. జ‌గ‌న్ వ‌స్తారా,రారా అనే దానిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా..!

YS Jagan : ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండ‌గా, ఈ స‌మావేశాల‌పై అంద‌రి దృష్టి నెల‌కొంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం జగన్​ హయాంలో జరిగిన అవకతవకలను బయటకు తీస్తోంది. అంతేకాకుండా పలు పనులపై కమిటీలు వేసి నిజనిజాలు బహిర్గతం చేస్తోంది. ఇదే సమయంలో ఆనాడు సోషల్​ మీడియాలో ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేసిన, నేతలపై అసభ్యకరంగా పోస్టులు చేసిన వారి భరతం పడుతోంది. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కొంతమంది ఎస్పీలు వైఎస్సార్సీపీ హయాంలో మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని ఘాటుగా స్పందించారు. దాని తర్వాత పోలీసుల తీరులో మార్పు కనిపిస్తోంది. సోషల్​ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టినవారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

YS Jagan క్లారిటీ ఇచ్చారుగా..

ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌కు ఐదేండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్‌ జగన్ తాజాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. నాటి ఎన్నికల్లో 151 సీట్లతో ఘన విజయం సాధించిన వైఎస్‌ జగన్‌ పార్టీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే ఓటర్లు పరిమితం చేశారు.తొలి సమావేశాల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఈ నెల 11వ తేదీ నుంచి సమావేశాలు జరగనున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హజరు అవుతారా ? లేదా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో తాజాగా పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హజరు అయ్యే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తాము గళం ఎత్తుతామన్న భయంతోనే ప్రభుత్వం వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు.

YS Jagan మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ సమావేశాలు జ‌గ‌న్ వ‌స్తారారారా అనే దానిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా

YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ సమావేశాలు.. జ‌గ‌న్ వ‌స్తారా,రారా అనే దానిపై క్లారిటీ వ‌చ్చేసిందిగా..!

ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇస్తేనే ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం .. వైసీపీకి మైక్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అటువంటప్పుడు సమావేశాలకు హజరవ్వడం వల్ల ఉపయోగం ఏముంటుందని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హజరు కావడం లేదని స్పష్టీకరించారు. అయితే అసెంబ్లీ సమావేశాల సమయంలో మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చినవాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడాన్ని మరోసారి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారన్న ఆందోళనతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది