Ys jagan : జగన్ పై ఒక్కసారిగా వాళ్లలో ఎందుకింత వ్యతిరేకత? కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే జగన్ కొంప ముంచిందా?
Ys jagan ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అందరికి సమ న్యాయం చేస్తాను అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ సమన్యాయం జరగడం లేదు అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ ల పేరుతో కొందరికే న్యాయం జరుగుతుంది. ఎక్కువ కులాల్లో ఉన్న పేద వారికి అస్సలు న్యాయం జరగడం లేదు అంటూ ఏపీలో ఉన్న ఒక వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్లుండి వారికి జగన్ పై ఆగ్రహం పెరగడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. వారు ఇంతలో అంతగా మారి జగన్ కు వ్యతిరేకంగా మారడంకు కారణం ఏంటీ అనుకుంటే వారికి పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేయబోతున్న 10 శాతం అదనపు రిజర్వేషన్ లు కారణం అంటున్నారు. ఉన్నత కులాల్లో ఉన్న వారికి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పది శాతం రిజర్వేషన్ లను ఇచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా హడావుడి మొదలు అయ్యింది.

is ap cm ys jagan mohan reddy ready to give more 10 percent reservations
కేసీఆర్ ను ఈ విషయంలో ఎందుకు ఫాలో అవ్వరు..
తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్రతి విషయంలో ఫాలో అయ్యే మీరు ఈ విషయంలో ఎందుకు ఫాలో అవ్వరు. మంచి పనులు చేస్తే పక్క సీఎంను ఫాలో అవ్వడంలో ఎలాంటి నామోషీ ఉండదు అంటూ ఈ సందర్బంగా ఏపీ జనాలు అంటున్నారు. అసలు తెలంగాణలో ఉన్న ఆర్థిక వెనుకబాటు తక్కువే అయినా కూడా వారు 10 శాతం వారికి రిజర్వేషన్ లు అమలు చేసేందుకు సిద్దం అయ్యారు. మరి ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో ఆర్థిక వెనుకబాటు చాలా ఎక్కువ. కనుక ఖచ్చితంగా తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఆర్థికంగా వెనుకబడ్డ వారికి సాయంగా నిలవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా జగన్ వెనుక ఉన్నారు. వారికి సాయంగా వైకాపా ప్రభుత్వం నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.
ఏపీలో ఇది సాధ్యమేనా..
ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ 10 శాతం రిజర్వేషన్ ను అమలు చేయడం ఎంత వరకు సాధ్యం అంటూ విశ్లేషకులు అంచనా వేసే ప్లాన్ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే ఉద్యాగాల ఎంపిక ఇతర విషయాల్లో 10 శాతంను అనధికారికంగా అమలు చేస్తుంది. తాజాగా టీ ప్రభుత్వం కూడా సిద్దం అయ్యింది. కనుక ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకంను వైకాపా నాయకులు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఆ నిర్ణయం తీసుకుంటే జగన్ మరోసారి దేవుడు అవుతాడని వైకాపా కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.