Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?
ప్రధానాంశాలు:
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో Janasena Party అంతర్గత అసమ్మతి ఒక్కసారిగా బహిర్గతమైంది. పవన్ కళ్యాణ్ Pawan Kalyan లక్ష్యాల కోసం, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన జనసైనికులు, వీర మహిళలు ప్రస్తుతం తీవ్ర నైరాశ్యంలో ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ వంటి కీలక నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కడం సంచలనంగా మారింది.
Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?
Pawan Kalyan 2024 ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందాలను టీడీపీ నేతలు తుంగలో తొక్కుతుందా ..?
2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం TDP, జనసేన Janasena , బీజేపీ BJP మధ్య కుదిరిన అధికార పంపిణీ ఒప్పందాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, టీడీపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ జనసేన ప్రయోజనాలను తుంగలో తొక్కుతున్నారని పార్టీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం నామినేటెడ్ పదవుల పందేరం. ఎన్నికల ఒప్పందం ప్రకారం.. జనసేన బలంగా ఉన్న చోట లేదా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో 60 శాతం పదవులు జనసేనకే దక్కాలి. మిగిలిన చోట్ల కూడా 30 శాతం వాటా దక్కాల్సి ఉంది. అయితే, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. నియోజకవర్గాల్లోని దేవాలయ కమిటీలు, ఇతర స్థానిక నామినేటెడ్ పోస్టుల్లో జనసేన కార్యకర్తలకు చోటు దక్కడం లేదని, పైగా టీడీపీ నేతలకే జనసేన ముద్ర వేసి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ తూర్పు వంటి నియోజకవర్గాల్లో ఒక్క ఆలయ కమిటీ పదవి కూడా జనసేనకు దక్కకపోవడం క్యాడర్‌లో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Pawan Kalyan పవన్ కళ్యాణ్ పై కోపంతో ఊగిపోతున్న పార్టీ క్యాడర్
ప్రస్తుతం ఈ సెగ పవన్ కళ్యాణ్ Pawan Kalyan కు కూడా తగులుతోంది. అధినేతగా పవన్ తమకు న్యాయం చేస్తారని భావించిన కార్యకర్తలు, ఇప్పుడు ఆయన మౌనాన్ని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల దృష్టికి ఈ విషయాలు వెళ్లకుండా స్థానిక టీడీపీ నేతలు చక్రం తిప్పుతున్నారా? లేక ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారా? అనే చర్చ మొదలైంది. తమ కష్టాన్ని గుర్తించకుండా, పార్టీకి సంబంధం లేని వారికి పదవులు ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయిలో పదవుల పంపిణీపై స్పష్టమైన సమీక్ష నిర్వహించకపోతే, పార్టీ క్యాడర్‌లో తిరుగుబాటు తప్పదనే సంకేతాలు ఈ పరిణామాల ద్వారా కనిపిస్తున్నాయి.