Janasena : ఇది జ‌న‌సేన విజ‌యంగా చెప్ప‌వ‌చ్చా.. మ‌త్స్య‌కారుల ఆనందం అంతా ఇంతా కాదు.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Janasena : ఇది జ‌న‌సేన విజ‌యంగా చెప్ప‌వ‌చ్చా.. మ‌త్స్య‌కారుల ఆనందం అంతా ఇంతా కాదు.!

Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గ‌త ప్ర‌భుత్వంని టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నాయ‌కులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డునపడేలా జగన్‌రెడ్డి ప్రభుత్వం 217 జీవోను రూపొందించిందన్నారు. అనాదిగా చెరువుల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఆ జీవోని ర‌ద్దు చేస్తామంటూ ఎన్నిక‌ల‌కి ముందు […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 November 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Janasena : ఇది జ‌న‌సేన విజ‌యంగా చెప్ప‌వ‌చ్చా.. మ‌త్స్య‌కారుల ఆనందం అంతా ఇంతా కాదు.!

Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గ‌త ప్ర‌భుత్వంని టీడీపీ నాయ‌కులు, జ‌న‌సేన నాయ‌కులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డునపడేలా జగన్‌రెడ్డి ప్రభుత్వం 217 జీవోను రూపొందించిందన్నారు. అనాదిగా చెరువుల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఆ జీవోని ర‌ద్దు చేస్తామంటూ ఎన్నిక‌ల‌కి ముందు కూట‌మి ప్ర‌భుత్వం చెప్పుకొచ్చింది.

Janasena జ‌న‌సైనికులు ఖుష్‌..

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన అనేక విధానాలను మారుస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈసారి మత్స్యకారులకు ఊరట నిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్య కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్న 217 జీవో రద్దు చేయాలని నిర్ణయించింది. మత్స్యకారులను ఇబ్బంది పెట్టే ఈ జీవోను రద్దు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. అలానే జ‌న‌సేన నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాము అధికారంలోకి వ‌స్తే ఆ జీవోని త‌ప్ప‌క ర‌ద్దు చేస్తామ‌ని అన్నారు. అప్పుడు అచ్చెన్నాయుడు ర‌ద్దు చేస్తామ‌ని అన‌గా, ఇప్పుడు అసెంబ్లీలో ప‌య్యావుల కేశ‌వ్ బ‌డ్జెట్‌లో దీని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వ‌డంతో మ‌త్స్య‌కారులు సంతోషంగా ఉన్నారు.

Janasena ఇది జ‌న‌సేన విజ‌యంగా చెప్ప‌వ‌చ్చా మ‌త్స్య‌కారుల ఆనందం అంతా ఇంతా కాదు

Janasena : ఇది జ‌న‌సేన విజ‌యంగా చెప్ప‌వ‌చ్చా.. మ‌త్స్య‌కారుల ఆనందం అంతా ఇంతా కాదు.!

ఇక దీనిని జ‌న‌సేన నాయ‌కులు త‌మ విజ‌యంగా చెప్పుకుంటున్నారు.అప్ప‌ట్లో జ‌గ‌న్ ఈ జీవోని ఎంత స‌మ‌ర్ధించుకున్నా చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 217 జీవో అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. ఈ జీవో కారణంగా మత్స్యకారులు సొంత ఊర్లల్లోని చెరువుల్లో చేపలు పట్టే హక్కును కోల్పోతారని విమర్శలు వచ్చాయి. ఈ జీవో ప్రకారం చేపలు పట్టడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచేది. టెండర్లు దక్కించుకున్నవారికే చేపలు పట్టే హక్కు ఉండేది. దీంతో అప్పట్లో ఈ జీవో మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. 217 జీవో ద్వారా మత్స్యకారుల ఉపాధి దెబ్బతినడమే కాకుండా వారి ఉనికికి కూడా భంగం కలుగుతుందని విపక్షాలు ఆరోపించాయి.అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం అన్ని చెరువులకు 217 జీవో వర్తించదని.. వంద ఎకరాల కంటే ఎక్కువ ఉన్న చెరువులకే జీవో వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది