Jr Ntr : అనుకున్నదే జరిగింది.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఎన్టీఆర్..!
Jr Ntr : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసారు. ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రధాని మోడీ ఈ ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొన్నారు. ఇక ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం, ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమానికి సినిమా పరిశ్రమ నుంచి కూడా పలువురుకి ఆహ్వానాలు అందాయి. మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. విశిష్ట అతిథిగా ఆయన్ని చంద్రబాబు ఆహ్వానించారు.
ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు నుంచి జూ ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందిందనే ప్రచారం జరిగిందని కొందరు, అందలేదని మరి కొందరు చెప్పుకొచ్చారు. అయితే ఎన్టీఆర్ తప్పక వస్తాడని అందరు భావించగా, కాని అది జరగలేదు. మరోసారి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.. దేవర షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల తారక్ ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేదని కొందరు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే చంద్రబాబుకి ఎన్టీఆర్‌కి మధ్య కొంత గ్యాప్ వచ్చినట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. తారక్‌ని చంద్రబాబు దూరం పెట్టారని అంటున్నారు.
Jr Ntr : అనుకున్నదే జరిగింది.. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టిన ఎన్టీఆర్..!
బాబాయ్ బాలయ్యతోనూ విభేదాలు నెలకొన్నాయని, నారా, నందమూరి ఫ్యామిలీలతో ఎన్టీఆర్‌కి కొంత గ్యాప్ నెలకొందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ పై తారక్ స్పందించకపోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసిందని అంటున్నారు. అంతకు ముందే కొన్ని వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, చంద్రబాబు అరెస్ట్ తర్వాత అది మరింత పెరిగిందనే రూమర్స్ వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు, ఆయన్ని టీడీపీ శ్రేణులు దూరం పెడుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. కొంత ట్రోల్స్ కూడా జరిగిన విషయం తెలిసిందే.
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
This website uses cookies.