Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకానికి సంబదించిన కీలక అప్డేట్
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలలో భాగంగా, అన్నదాత సుఖీభవ మరియు తల్లికి వందనం పథకాల అమలు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనుంది. 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఈ రెండు పథకాలకు నిధులు కేటాయించారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ కింద రైతులకు మూడు విడతల్లో ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి కీలక మార్గదర్శకాలు ప్రకటించారు.

Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ పథకానికి సంబదించిన కీలక అప్డేట్
Annadata Sukhibhava అన్నదాత సుఖీభవ నిధులు ఎవరికీ వస్తాయో తెలుసా..?
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో కలిపి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ 19వ విడతగా కేంద్రం ఏపీకి రూ.854.28 కోట్లు విడుదల చేసింది. దీని ద్వారా 41,27,619 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్, రబీ, మధ్యలో ఒకసారి మొత్తం మూడు విడతల్లో సాయం అందిస్తుండగా, ఆ సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తన అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది.
ఈ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద 41.27 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతుండగా, ఏపీలో రైతుల సంఖ్య 55 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలపై ప్రభుత్వం అధికారిక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అంతేకాకుండా, కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరేలా ప్రత్యేక కసరత్తు చేస్తోంది.