Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు – కిరణ్ రాయల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు – కిరణ్ రాయల్

 Authored By ramu | The Telugu News | Updated on :3 June 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు - కిరణ్ రాయల్

Kiran Rayal : వైసీపీకి వెన్నుపోటు దినం నిర్వహించే నైతిక హక్కు లేదని.. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డినే పెద్ద వెన్నుపోటు దారుడని కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు దినం కాదు గుండెపోటు దినంగా ప్రకటించాలంటూ కిరణ్ రాయల్ సలహా ఇచ్చారు. బాబాయి ఆత్మకు శాంతి కలగాలంటే కచ్చితంగా మార్చి 15ను గుండెపోటు , గొడ్డలిపోటు దినంగా ప్రకటించాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు మెయిల్ చేశాం అని తెలిపారు…

Kiran Rayal జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు కిరణ్ రాయల్

Kiran Rayal : జగన్ పెద్ద వెన్నుపోటు దారుడు – కిరణ్ రాయల్

Kiran Rayal : మార్చి 15ను గుండెపోటు , గొడ్డలిపోటు దినంగా ప్రకటించాలి.. కిరణ్ డిమాండ్

కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. వివేకా(బాబాయ్)హత్యకి గొడ్డలి పోటు పొడిచి…ఇప్పుడు వెన్నుపోటు దినం, పోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సొంత చెల్లికి, తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఏపీ సర్వనాశనం అయిందని చెప్పారు. పెన్షన్ రూ. 4 వేలు చేసింది కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

వైసీపీ హయాంలో రూ. 1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని ప్రకటించారు. జగన్ హయాంలో అమరావతిని సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. మూడు రాజధానులని చెప్పి ప్రజలను మభ్యపెట్టారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్, ఉచిత గ్యాస్ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబం వెన్నుపోటును, గొడ్డలి పోటును పేటెంట్‌గా తీసుకుందని సెటైర్లు వేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది