Kiran Royal : నేను చచ్చేంతవరకు పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోలేను.. కిరణ్ రాయల్ కామెంట్స్
ప్రధానాంశాలు:
Kiran Royal : నేను చచ్చేంతవరకు పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోలేను.. కిరణ్ రాయల్ కామెంట్స్
Kiran Royal : తిరుపతి జనసేన పార్టీ Janasena Party నేత కిరణ్ రాయల్.. లక్ష్మి అనే మహిళతో ఏర్పడిన వివాదం ఎంత పెద్ద దుమారం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లక్ష్మి Lakshmi అనే మహిళతో కిరణ్ రాయల్ కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్థిక సంబంధాలతో పాటు వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి.

Kiran Royal : నేను చచ్చేంతవరకు పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకోలేను.. కిరణ్ రాయల్ కామెంట్స్
Kiran Royal ఎమోషనల్ కామెంట్స్..
తనకు కోటి రూపాయలకుపైగా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తూ తెరపైకి వచ్చారు. వైసీపీ YCP నాయకులే ఆమెను బయటకు తెచ్చి తనను టార్గెట్ చేస్తున్నారని కిరణ్ రాయల్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలు గాల్లో పుట్టించినవి కావని వివాదం ఉందని అర్థమైంది.
అయితే కిరణ్ రాయల్‌పై పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలనుకున్నారో అన్ని రకాలుగా టార్చర్ పెట్టారు. జగన్ మోహన్ రెడ్డిని JAgan Mohan Reddy చిట్టి రెడ్డి అని 2.ఓ అని పోస్ట్‌లు పెట్టిన దగ్గర నుండి నన్ను మానసికంగా చంపేశారు. అయితే అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పు చేయలేదని సపోర్ట్ చేశారు. వాస్తవాలు తెలియాలి అని ఆయన అన్నారు. నన్ను నమ్మారు. పవన్ కళ్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటా,నేను ఏ తప్పు చేయలేదని పవన్ కళ్యాణ్‌కి తెలిసి విచారణ చేయమన్నారు అంటూ కిరణ్ స్పష్టం చేశారు.