KK Survey : ఏడాది కూటమి పాలనపై కేకే సర్వే..ఆ ఎమ్మెల్యేలు ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడి…
ప్రధానాంశాలు:
KK Survey : ఏడాది కూటమి పాలనపై కేకే సర్వే..ఆ ఎమ్మెల్యేలు ప్రమాదంలో ఉన్నట్లు వెల్లడి...
KK Survey : ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే సంస్థ మళ్లీ కీలక విశ్లేషణతో ముందుకొచ్చింది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి 164 స్థానాలను గెలుస్తుందన్న అంచనాతో అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సర్వే, వాస్తవంగా ఫలితాల రూపంలో నిజమైంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత కిరణ్ కొండేటి తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
KK Survey ఏడాది కూటమి పాలనపై కేకే సర్వే
తాజాగా ‘పారావీల్’ అనే రియల్ టైమ్ రాజకీయ అనాలిటిక్స్ యాప్‌ను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. కూటమి పాలనపై ప్రజల్లో మెజారిటీ మద్దతే ఉన్నప్పటికీ, 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందినవారన్నది గోప్యంగా ఉంచారు. కూటమి నేతల పరిపాలన పట్ల ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలున్నాయని పేర్కొన్నారు. ఈ డేటా తమ యాప్ ద్వారా నిరంతరంగా సేకరించబడుతుందన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంచేశారు.
కూటమి మద్దతుదారుల్లో 7 శాతం మంది టీడీపీ నేత ఎన్టీఆర్ (జూనియర్ ఎన్టీఆర్) ను సీఎం అభ్యర్థిగా కోరడం. ఇదే విధంగా వైసీపీ మద్దతుదారుల్లోనూ 21 శాతం మంది ఎన్టీఆర్‌నే ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించటం కిరణ్ చేసిన వ్యాఖ్యల ప్రకారం బయటపడింది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎంతగా ఉందో ఈ సంఖ్యలు చెబుతున్నాయని, రాజకీయ భవిష్యత్తులో అతని పాత్రపై కొత్త ఊహాగానాలకు దారి తీస్తోంది.