Kodali Nani : రేవంత్ రెడ్డి కి ఫోన్ చేయడానికి అతడేమైనా తోపా .. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
Kodali Nani : ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అయినప్పుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కనీసం కాల్ కూడా చేయలేదని రేవంత్ రెడ్డి వర్గం, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వై. ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసిన కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారని చెప్పారు. కేసిఆర్ కు శస్త్ర చికిత్స జరిగింది కాబట్టి ఆయనను పరామర్శించారని, రేవంత్ రెడ్డికి అలా ఏమైనా జరిగిందా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. ఫోన్ చేసి చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో పనిచయడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
అసలు రేవంత్ రెడ్డికి సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఫోన్ చేయాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సీఎం జగన్ ఎందుకు కలవాలో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నలు సంధించారు. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర సీఎం అని, పట్టించుకునే సమయం జగన్మోహన్ రెడ్డికి లేదని కొడాలి నాని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిది ప్రాంతీయ పార్టీనా..ఆయన ఏమైనా సుప్రీమా..అని ప్రశ్నించిన కొడాలి నాని ప్రత్యేకంగా ఆయనను కలవాల్సిన అవసరం లేదన్నారు. రేవంత్ రెడ్డి షర్మిలకు సపోర్ట్ చేస్తే తమకు ఏంటని ప్రశ్నించారు. అవసరమైతే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి ఏపీ ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకున్న తమకు అభ్యంతరం లేదని కొడాలి నాని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని వద్దనే మూసేసామని కొడాలి నాని తెలిపారు.
ఇక ఈసారి ఎన్నికల్లో కొడాలి నాని సీటు లేదని జరుగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. సీఎం వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరిని పిలిచి పదవి నుంచి ఎందుకు తొలగిస్తున్నారో, ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో చెప్పి చేస్తున్నారని కొడాలి నాని అన్నారు. నాకు సీటు లేదనేది అవాస్తవం అని అన్నారు. మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు గురించి మాట్లాడటానికి సీఎం వై.ఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసామని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారా అని చూస్తాడు. వాళ్లకు ఫోన్ చేసి నేనే గెలిపించాను అని చెప్పుకుంటాడు. మాకు అలాంటి పరిస్థితి లేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా డబ్బులకు సీట్లు అమ్ముకుంటున్నాడు. చంద్రబాబు డబ్బులకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నాడు. చంద్రబాబు ఒక 420. ఎన్టీరామారావు పెట్టిన పార్టీలో పందికొక్కు లాగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని కొడాలి నాని తీవ్రవ్యాఖ్యలు చేశారు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.