Kodali Nani : చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు కొడాలి నాని కౌంటర్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kodali Nani : చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు కొడాలి నాని కౌంటర్…!

Kodali Nani : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ భారీ బహిరంగ సభలో ప్రస్తావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని నువ్వు సిద్ధమేనా అంటూ వై.యస్ జగన్ కు సవాల్ చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి కొడాలి నాని తాజాగా ప్రెస్ మీట్ ద్వారా చంద్రబాబు […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 February 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Kodali Nani : చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు కొడాలి నాని కౌంటర్...!

Kodali Nani : ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేసి ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ భారీ బహిరంగ సభలో ప్రస్తావించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని నువ్వు సిద్ధమేనా అంటూ వై.యస్ జగన్ కు సవాల్ చేశారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి కొడాలి నాని తాజాగా ప్రెస్ మీట్ ద్వారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి బహిరంగ సభలో కూడా తన పరిపాలనలో మంచి జరిగింది అనిపిస్తేనే , మీ ఇంట్లో మేలు జరిగింది , మీ పిల్లలకు మేలు జరిగింది అనిపిస్తేనే తనకు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం అందితేనే ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. అలాంటి గొప్ప నాయకుని పట్టుకుని నువ్వు నిజంగా బహిరంగ చర్చ కు సిద్ధమని సవాల్ చేస్తావా అంటూ ప్రశ్నించారు.

అసలు భారతదేశ రాజకీయాలలో బహిరంగ చర్చ ఎప్పుడైనా జరిగిందా.. జగన్మోహన్ రెడ్డి కంటే ముందు 14 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇక ఆ సందర్భంలో ఆయన చేసిన మంచి ఏంటి…?ఆయన పాలనలో ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటి..? అనే విషయాలను తెలియజేయాల్సిందిగా కొడాలి నాని ప్రశ్నించారు. ఇక ఈ బహిరంగ చర్చ పెడితే ఇద్దరు పెద్దల సమక్షంలో అటు టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణులు కూర్చుని మాట్లాడుకుంటాం. ఇక ఆ సభలో మేము చేసిన మంచి ఏంటో , ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఏంటో అన్ని చెప్పగలుగుతాం. కానీ నీవు చేసిన మంచెంటో 14 సంవత్సరాల అధికారంలో ఉండి ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు చేసిన మేలేంటి అనే విషయాలను చెప్పగలవా అంటూ ఆయన ప్రశ్నించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవటం చేతకాక కూటమితో కలిసి అడుగులేస్తున్న నువ్వు నాయకుడివా అంటూ ఎద్ధెవా చేశారు .150 స్థానాలలో ఏకగ్రీవంగా గెలుపొందిన నాయకుడితో చంద్రబాబు నాయుడుకి పోలిక ఏంటి అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి జగన్ పరిపాలనపై అవగాహన ఉందని అందుకే ప్రజలే మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుంటారంటూ ఈ సందర్భంగా కొడాలి నాని తెలియజేశారు. అదేవిధంగా వై.సీ.పీ పార్టీలో జగన్ తో కలిసి పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఈ పార్టీని వదిలేసి వెళ్లరని వారికి టికెట్టు లభించిన లభించకపోయినా ఈ పార్టీలోనే కొనసాగుతారంటూ ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతూ..ఆయన మొదట ఆలోచన చేయకుండా కాస్త అసంతృప్తి ఉండడంతో పార్టీని వదిలిపెట్టి వెళ్లారని , ఇక ఇప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ పార్టీలోకి తిరిగి వచ్చారని చెప్పుకొచ్చారు. తన పార్టీలోని నేతలతో వైఎస్ జగన్ చాలా సన్నిహితంగా ఉంటారని , మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారని అందుకే జగన్ తో కలిసి పనిచేసిన ఏ ఒక్కరు కూడా ఆయనను వదిలిపెట్టి వెళ్ళరంటూ ఈ సందర్భంగా కొడాలి నాని తెలియజేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది