Kodali Nani VS Chandrababu : ఏపీలో ఎన్నికల వాతావరణం వాడీవేడీగా కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇక తాజాగా గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు నాయుడు పై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు 420 అని, పెద్ద గజదొంగ అని, సీనియర్ ఎన్టీఆర్ ను గంజాయి మొక్క అని ముఖ్యమంత్రిగా అతడు పనికిరాడు అని చెప్పి ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ స్వస్థలానికి గుడివాడ వచ్చి నివాళులర్పించడం ఇదంతా పదవి కోసమే చేస్తున్నాడు అని ఫైర్ అయ్యారు. 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడు అని ప్రశ్నించారు. ఇల్లు కట్టించలేదు. ఫ్లై ఓవర్లు కట్టించలేదు. ఆసుపత్రులు కట్టించలేదు. రోడ్ల వేయలేని దద్దమ్మ ఇప్పుడు గుడివాడ గురించి విమర్శిస్తావా అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.
టిడ్కో ఇళ్ల స్థలం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కొన్నారని, లబ్ధిదారుల దగ్గర 80 కోట్లు వసూలు చేసి 20 శాతం మాత్రమే చంద్రబాబు ఇళ్లను కట్టించాడని, ఇక వైసీపీ లబ్ధిదారుల డబ్బులను వెనక్కి ఇచ్చేసి ఇళ్లను నిర్మించిందని కొడాలి నాని అన్నారు. తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని పందికొక్కులాగా మేసాడు అని, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే తన ఆటలు కొనసాగవని, ఆ పిచ్చి బాలయ్యతో ఫ్లెక్సీలు చింపడం లాంటివి చేస్తున్నాడని కొడాలి నాని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని సన్నాసి దద్దమ్మ లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని సర్వనాశనం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ను అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావటానికి చంద్రబాబు చూస్తున్నాడని, అతడు చెప్పేవన్నీ అబద్ధాలే అని కొడాలి నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
ఇక గుడివాడలో రా కదలిరా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు కొడాలి నాని పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల నోరు మురికి కాలువని, తన వద్ద ఓనమాలు నేర్చుకొని తనకే పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారని వండిపడ్డారు. నోరు ఉందని పారేసుకుంటే భవిష్యత్తులో అందుకు తగ్గ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నానని కొడాలి నానికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. టిడ్కో ఇళ్లను టీడీపీ 90 శాతం పూర్తి చేస్తే అధికార పార్టీ కనీసం 10% కూడా పూర్తి చేయలేదని చంద్రబాబు విమర్శించారు. అలాంటివారు మూడు రాజధానులను కడతారా అని ఎద్దేవా చేశారు. ప్రజలు తొందరలోనే వైసీపీని భూస్థాపితం చేస్తారని అన్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.