7th Pay Commission
7th Pay Commission : మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. అయితే ఈ మధ్యనే జీతాల పెంపుతో లబ్ధి పొందిన ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త తీసుకొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్చి నెలలో వీరికి డియర్ నెస్ అలవెన్స్ పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈసారి డీఏ పెంపు ఎంతవరకు ఉండవచ్చు అనే అంశాలపై అనేక రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ నాలుగు శాతం పెంచే అవకాశం ఉన్నట్లు తాజాగా ఎకనామిక్ టైమ్స్ నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయంపై ఇప్పటివరకు అధికార ప్రకటన మాత్రం రాలేదు.ఇక ఈ డిఏ పెంపు విషయంలో ఆమోదం లభిస్తే మాత్రం… 2024 జనవరి 1 నుండి ఇంక్రిమెంట్ అమలు అవుతుందని చెప్పాలి. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మార్చిలో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక 2023 జూలై 1 నుండి అమలులోకి వచ్చిన నాలుగు శాతం మరియు ప్రస్తుతం డియర్ నెస్ అలవెన్స్ మొత్తం కలిపి 46 శాతంగా ఉంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న అంచనాలు నిజమైతే మరో నాలుగు శాతం పెంపుతో మొత్తం డిఏ 50% కి చేరుతుందని చెప్పాలి.
డియర్ నెస్ అలవెన్స్ అనేది ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో కీలకమైన అంశమని చెప్పాలి. ఈ డియర్ నెస్ అలవెన్స్ అనేది ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కోవడానికి రూపొందించడం జరిగింది. అయితే ఈ అలవెన్స్ ను సాధారణంగా ఏడాదికి రెండుసార్లు సవరణ చేస్తారు. ఏడాదిలో మార్చి మరియు సెప్టెంబర్ లో దీనిని సవరిస్తారు. ఇక ఇది పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకునే విధంగా ఉద్యోగి జీతం పెంచడానికి సహాయం పడుతుంది.అయితే డిఎ కాలిక్యులేషన్ ఫార్ములా 2006లో సవరించడం జరిగింది. ఇక దీనిని ఏడాదిలో 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే డియో పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం హౌస్ రెంట్ అలవెన్స్ కూడా పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అద్దె ఇంట్లో నివసించేవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటే వారు హెచ్ఆర్ఏ ప్రయోజనాలను పొందుతారు. ఇక ఈ అమౌంట్ అనేది వారు నివసించే నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
అయితే సిటీ కేటగిరీల ఆధారంగా హెచ్ఆర్ఏ ను X , Y , Z వంటి మూడు క్యాటగిరీలు విభజించడం జరిగింది. జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ విభజన చేపట్టారు. అంటే 50 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన X కేటగిరి నగరాలుగా ఇక్కడ నివసించే ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ శాలరీ లో 24% హెచ్ఆర్ఏ పొందుతారు.అదే విధంగా 5 లక్షల నుంచి 50 లక్షల మధ్య జనాభా ఉన్న ప్రాంతాలలో ప్రభుత్వ ఉద్యోగులు నివసిస్తే Y వర్గంలోకి వస్తారు . ఇక వీరికి 16% హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక Z కేటగిరీలో 5 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలు ఉంటాయి. ఇక్కడ నివసించే ఉద్యోగులకు 8% హెచ్ఆర్ఏ వర్తిస్తుంది.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.