Kodi Kathi Srinu : కోడి కత్తి శీను పేరెంట్స్ పరిస్థితి తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్న నారా లోకేష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kodi Kathi Srinu : కోడి కత్తి శీను పేరెంట్స్ పరిస్థితి తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్న నారా లోకేష్

 Authored By kranthi | The Telugu News | Updated on :4 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  కోడి కత్తి శీనును 5 ఏళ్ల నుంచి జైలులో పెట్టారు

  •  గీత గీసుకుపోయినందుకు ఇంత దారుణంగా జైలులో పెట్టిస్తారా?

  •  వాపోయిన కోడి కత్తి శీను తల్లిదండ్రులు

Kodi Kathi Srinu : జనపల్లి శ్రీనివాస్ అనే పేరు కంటే కోడి కత్తి శీను అంటే అందరికీ తెలుసు. కోడి కత్తి శీను తండ్రి, తల్లి, అన్న.. పరిస్థితి చూస్తే ఎవ్వరికీ కన్నీళ్లు ఆగవు. ఈ వయసులో ఉన్న తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే కొడుకు 5 ఏళ్ల నుంచి జైలులో ఉన్నాడు. తన సొంత బాబాయిని ముక్కలు ముక్కలుగా నరికిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు. రకరకాల నేరాలు చేసిన వాళ్లు బయట తిరుగుతుంటే చిన్న గీత గీసుకుందనే కారణం చూపించి శీనును ఐదేళ్ల నుంచి జైలులో ఉంచారు. అతడు కుట్ర ఏం చేయలేదు.. వదిలేయాలని ఎన్ఐఏ చెబుతుంటే మళ్లీ హైకోర్టులో కేసు వేశాడు జగన్ రెడ్డి. నన్ను కొట్టాడు.. అతడిని శిక్షించాలని దళిత కుర్రాడి మీద ఫిర్యాదు ఇచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. 5 ఏళ్ల నుంచి ఆ కుర్రాడిని ఇబ్బందులు పెడుతున్నారు. నీ మీద 38 కేసులు ఉన్నాయి. మరి.. నువ్వు ఎన్ని సార్లు జైలుకు వెళ్లావు అంటూ జగన్ పై నారా లోకేష్ మీటింగ్ లో కోడి కత్తి శీను పేరెంట్స్ మండిపడ్డారు. చేయని నేరానికి ఐదేళ్లుగా జైలులో పెట్టారు. నిజంగానే శీను దాడి చేయలేదు. మమ్మల్ని ఇంటికి పలకరించడానికి కూడా ఎవ్వరూ రాలేదు. దాడి జరిగిన మొదటి రోజునే సలీం అనే లాయర్ తొలి నుంచి మా తరుపున పోరాడుతున్నారు.

చేయని నేరానికి ఇరుక్కుపోయాను. ఎక్కడ చంద్రబాబు గారు మీటింగ్ పెట్టినా, నారా లోకేష్ గారిని కూడా కలువు అని చెప్పాడు. అసలు ఏం నేరం చేయలేదు. పొడవలేదు.. ఏం లేదు. కేవలం గీసుకుపోయింది అంతే. దానికే ఇన్నేళ్ల నుంచి బాధపెడుతున్నారు. మా ఊరు 3 కిమీల దూరంలోకి సీఎం వచ్చారు. మేము వెళ్లి అర్జీ పెట్టుకున్నాం. నేను కూలీ పని చేయాలి. ప్రతి నెల 20 వేలు సంపాదించేవాడు. 5 ఏళ్ల నుంచి జైలులో మగ్గిపోతున్నాడు.. అని చెబితే మాకు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు సీఎం.

Kodi Kathi Srinu : మమ్మల్ని గృహ అరెస్ట్ చేశారు

ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదు.. మనకు ఎన్నికలు రాకముందే తమ్ముడిని బెయిల్ మీద మీరు ఎలాగైనా తీసుకొస్తారని నేను నమ్ముతున్నా.. అని నారా లోకేష్ ను కోడి కత్తి శీను అన్న వేడుకున్నారు. ఎన్నికల ముందు కోడి కత్తి డ్రామా చూశాం. టీడీపీ వాళ్లు చేయించారని అన్నారు. చూడండి.. కుటుంబాన్ని కూడా వేధిస్తున్నారు. సీఎం అనుకుంటే ఒక్క సెకండ్ లో కేసు పోతుంది. మనోడు బయటికి వస్తాడు. కానీ.. బయటికి రానివ్వరు. దర్యాప్తుకు కూడా సహకరించరు. ఐదేళ్ల నుంచి ఒక దళిత కుర్రాడిని కేసులో ఇరికించారు. మీరు ధైర్యంగా ఉండండి.. న్యాయ పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది