Krishnam Raju Wife in YCP : భీమవరం వైసీపీ ఎంపీగా కృష్ణం రాజు భార్య? బరిలోకి దిగి ప్రభాస్ ఫుల్ సపోర్ట్??
Krishnam Raju Wife in YCP : రాజకీయాలకు, సినిమా రంగానికి ఏదో సంబంధం ఉంది. అవును.. అందుకే రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి కూడా వెళ్తుంటారు. అలా సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి రాణించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నటులూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక ఆర్కే రోజా, బాలకృష్ణ.. ఇలా వీళ్లంతా ఇండస్ట్రీలో టాప్ నటులే. రాజకీయాల్లోనూ వీళ్లు […]
Krishnam Raju Wife in YCP : రాజకీయాలకు, సినిమా రంగానికి ఏదో సంబంధం ఉంది. అవును.. అందుకే రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. సినిమాల్లో ఉన్నవారు రాజకీయాల్లోకి కూడా వెళ్తుంటారు. అలా సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి రాణించిన వాళ్లు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నటులూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక ఆర్కే రోజా, బాలకృష్ణ.. ఇలా వీళ్లంతా ఇండస్ట్రీలో టాప్ నటులే. రాజకీయాల్లోనూ వీళ్లు తమ సత్తా చాటుతున్నారు.ఒక సీనియర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ కృష్ణంరాజు లాంటి సీనియర్ నటులు కూడా రాజకీయాల్లో రాణించారు. కృష్ణంరాజు కేంద్ర మంత్రిగానూ పనిచేశారు.
ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు. అందుకే ఆయన ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి ఒకరు వస్తున్నారు. ఒకరు అనగానే ప్రభాస్ అనుకునేరు. ప్రభాస్ రాజకీయాలకు దూరం కానీ.. ఆయన పెద్దమ్మ అంటే కృష్ణంరాజు భార్య రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి.. నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. తను నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. అది కూడా వైసీపీ పార్టీ నుంచి.
Krishnam Raju Wife in YCP : నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ప్రభాస్ పెద్దమ్మ
వైసీపీ హైకమాండ్ కూడా ఆమెను పార్టీలో చేర్చుకొని ఎంపీ టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే.. చనిపోయిటప్పటికి కృష్ణంరాజు బీజేపీ పార్టీలో ఉన్నారు. కానీ.. ఆయన బతికి ఉన్నరోజుల్లో అంతగా బీజేపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దానికి కారణం ఆయన అనారోగ్యం. కానీ.. ఇప్పుడు ఆయన లేరు. వైసీపీ పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉండటంతో శ్యామలాదేవి కూడా వైసీపీలో చేరేందుకు సుముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి.. ఒకవేళ ఆమె వైసీపీ తరుపున నరసాపురం ఎంపీగా పోటీ చేస్తే.. ప్రభాస్ ఆమె తరుపున ప్రచారం చేస్తారా? ఆయన ప్రచారం చేస్తే ఇక ఆమె గెలవకుండా ఉంటుందా? చూద్దాం ఏం జరుగుతుందో?