
Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.1292.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రజావేదిక సభలో హితవు, హెచ్చరికలతో కూడిన ప్రసంగం చేశారు. “సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 వచ్చాడు” అంటూ తన తాజా ప్రభుత్వాన్ని సూచించారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించమని, ప్రభుత్వ పనుల్లో అడ్డుపడితే తగిన శిక్ష అనుభవిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.
Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు
అంతే కాదు గత వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో నకిలీ మద్యం, మహిళలపై దాడులు, భూ కబ్జాలు జరగాయన్నారు. భూముల రికార్డుల్ని మార్చి ప్రజల ఆస్తులను లూటీ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే ప్రారంభించామన్నారు. ప్రజల భూములకు పూర్తి రక్షణ ఇస్తామని, వారి ఆస్తులను ప్రభుత్వమే భద్రపరిస్తుందని హామీ ఇచ్చారు. తాను అభివృద్ధిని ఒక యజ్ఞంగా చూస్తానని, దాన్ని అడ్డుకునే వారిని సహించబోనని స్పష్టం చేశారు.
ఇకపై ఇంటింటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేసి, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. అలాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు పాల ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్, హంద్రీనీవా ద్వారా నీటి సరఫరా, విమానాశ్రయం నిర్మాణం, నాలుగు వరుసల రహదారి వంటివి అన్ని కుప్పం అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తాము చేస్తున్న అభివృద్ధిని తెలియజేస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నిశ్చయంగా చెప్పారు. అభివృద్ధే ధ్యేయమని.. కులం, మతం, ప్రాంతాన్ని దాటి ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని సీఎం బాబు స్పష్టం చేశారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.