Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

 Authored By ramu | The Telugu News | Updated on :3 July 2025,1:10 pm

ప్రధానాంశాలు:

  •  తోకలు కట్ చేస్తా అంటూ కుప్పం అడ్డా పై చంద్రబాబు మాస్ వార్నింగ్

  •   జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

Chandrababu  : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.1292.74 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, ప్రజావేదిక సభలో హితవు, హెచ్చరికలతో కూడిన ప్రసంగం చేశారు. “సీబీఎన్ 14 కాదు.. సీబీఎన్ 95 వచ్చాడు” అంటూ తన తాజా ప్రభుత్వాన్ని సూచించారు. తప్పు చేసిన వారిని ఉపేక్షించమని, ప్రభుత్వ పనుల్లో అడ్డుపడితే తగిన శిక్ష అనుభవిస్తారంటూ వార్నింగ్ ఇచ్చారు.

Chandrababu జగన్ లా హత్యా రాజకీయాలు శవ రాజకీయాలు చేయను సీఎం చంద్రబాబు

Chandrababu : జగన్ లా హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను : సీఎం చంద్రబాబు

Chandrababu : కుప్పం నియోజకవర్గాన్ని రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా చేస్తా – చంద్రబాబు

అంతే కాదు గత వైసీపీ పాలనపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గత ఐదేళ్లలో నకిలీ మద్యం, మహిళలపై దాడులు, భూ కబ్జాలు జరగాయన్నారు. భూముల రికార్డుల్ని మార్చి ప్రజల ఆస్తులను లూటీ చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా, ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయి భూ సర్వే ప్రారంభించామన్నారు. ప్రజల భూములకు పూర్తి రక్షణ ఇస్తామని, వారి ఆస్తులను ప్రభుత్వమే భద్రపరిస్తుందని హామీ ఇచ్చారు. తాను అభివృద్ధిని ఒక యజ్ఞంగా చూస్తానని, దాన్ని అడ్డుకునే వారిని సహించబోనని స్పష్టం చేశారు.

ఇకపై ఇంటింటికీ సౌర విద్యుత్ ఏర్పాటు చేసి, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించనున్నట్లు వెల్లడించారు. అలాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు పాల ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్, హంద్రీనీవా ద్వారా నీటి సరఫరా, విమానాశ్రయం నిర్మాణం, నాలుగు వరుసల రహదారి వంటివి అన్ని కుప్పం అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. “సుపరిపాలన తొలి అడుగు” కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తాము చేస్తున్న అభివృద్ధిని తెలియజేస్తామని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నిశ్చయంగా చెప్పారు. అభివృద్ధే ధ్యేయమని.. కులం, మతం, ప్రాంతాన్ని దాటి ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని సీఎం బాబు స్పష్టం చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది