Botsa Satyanarayana : బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స.. ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Botsa Satyanarayana : బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స..  ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2025,12:46 pm

ప్రధానాంశాలు:

  •  బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స..  ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..!

Botsa Satyanarayana : వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు దినం” కార్యక్రమంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో జరిగిన ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్న పార్టీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స కిందపడిపోవడంతో అక్కడి నేతలు, కార్యకర్తల్లో కలకలం రేగింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆయన వడదెబ్బకు గురై ఇలా జరిగినట్టు తెలుస్తోంది.

Botsa Satyanarayana బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు హమ్మయ్య బొత్స బాగానే ఉన్నాడు

Botsa Satyanarayana : బిగ్ బ్రేకింగ్ కుప్పకూలిన బొత్స..  ఊపిరి పీల్చుకున్న వైసీపీ శ్రేణులు.. హమ్మయ్య.. బొత్స బాగానే ఉన్నాడు..!

Botsa Satyanarayana : బొత్స ప్రస్తుతం ఎలా ఉన్నాడంటే…

ఈ సంఘటనకు ముందు చీపురుపల్లిలోని కొత్త పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన ర్యాలీ, మూడురోడ్ల జంక్షన్ వరకు సుమారు కిలోమీటరన్నర పాటు సాగింది. ఎండ తీవ్రతను లెక్కచేయకుండా కాలినడకన బొత్స పాల్గొనడంతో శరీరానికి అధిక ఉష్ణోగ్రతగా మారినట్లు వైద్యులు చెబుతున్నారు. అనంతరం జరిగిన సభలో వాహనంపై ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పార్టీ శ్రేణులు వేగంగా స్పందించి హాస్పటల్‌కు తరలించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

వైఎస్సార్‌సీపీ ఈ కార్యక్రమాన్ని ఏపీ కూటమి ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నిర్వహించింది. గత ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, “వెన్నుపోటు దినం”గా పాటించాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైఎస్సార్‌సీపీ నేతలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యిందని ఆరోపించారు. ఈ సందర్భంలో బొత్స సత్యనారాయణకు జరిగిన సంఘటనతో కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురైనా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందన్న సమాచారం అందడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది