Mahasana Rajesh : గన్నవరంలో చక్రం తిప్పుతున్న మహాసేన రాజేష్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mahasana Rajesh : గన్నవరంలో చక్రం తిప్పుతున్న మహాసేన రాజేష్…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 February 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Mahasana Rajesh : గన్నవరంలో చక్రం తిప్పుతున్న మహాసేన రాజేష్...!

Mahasana Rajesh : ఒకప్పుడు వైసీపీ అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తులలో మహాసేన రాజేష్ కూడా ఒకరు. అలాంటి వ్యక్తి వైసీపి పార్టీని గెలిపించుకోవడం కృషి చేసిన వ్యక్తి ఇప్పుడు వైసీపీ పార్టీ పాలన నచ్చలేదు అని చెప్పి టిడిపి పార్టీలో చేరిన విషయం మనకు తెలిసిందే. అయితే ఒక వ్యక్తి ఒక బ్యాంకు కి కలెక్షన్ ఏజెంట్ గా పని చేసిన స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదగడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ని సైతం కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా అది కూడా ఎమ్మెల్యే టికెట్ తగ్గించుకున్న 24 గంటల్లో కోలుకోలేని దెబ్బ కొట్టి లాగా ఎదుగుతున్నాడు అనే చిన్న విషయం కాదు. అయితే అతను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు. ఎందుకు అతన్ని చంద్ర బాబు మెచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది.ఈ వివరాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మహాసేన రాజేష్ ముందు గా ఒక బ్యాంకులో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ లో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత బట్టల వ్యాపారం పెట్టుకున్నారు. ఆ తర్వాత అది చేస్తూనే వాటితో పాటు ఒక టీం ని రెడీ చేసుకొని ఆయన సామాజిక వర్గానికి అలాగే ఆయన రిలీజియన్ కి సంబంధించి జరిగే అన్యాయాలను ఎస్సీ , ఎస్టీ , దళితులకు జరిగే అన్యాయాల గురించి ఒక దళితుడిగా పోరాటాలు చేస్తూ ఉండే వారు. అలాగే అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఇబ్బందుల్ని ఆయన చూపిస్తూ ఇలా అన్యాయం జరిగింది. దళితులకి ఇలా అన్యాయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీసులు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని స్ట్రాంగ్ గా నిలబడినటువంటి వ్యక్తి. ఇలా నిలబడుతూ పోరాటాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడ్డారు. గత ఎలక్షన్స్ సమయంలో కూడా వైసీపీ కి కొంత సపోర్ట్ చేశారు.

అయితే ఆయన వలన కూడా వైసీపీకి కొన్ని ఓట్లు పడ్డాయని చెప్పాలి. ఇక ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయనకి జగన్ నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డి పాలన ఒకలాగా ఉంటుంది అనుకుంటే ఆయన పాలన చాలా డిఫరెంట్ గా ఉందని పార్టీ మారడం జరిగింది.అయితే ఒక వ్యక్తి పార్టీ నుంచి మరొక పార్టీకి మారుతున్నారు అంటే వారికి పదవి ఇవ్వలేదనో ఇంకోటి ఏదో ఇవ్వలేదని వచ్చేస్తారు. కానీ మహాసేన రాజేష్ మాత్రం తాను గెలిపించుకున్న వ్యక్తి పాలన బాగోలేదని ఆయనని వదిలేశారు. అయితే జగన్ పాలన బాగోలేదని అతని ప్రశ్నించినప్పుడు అతని మీద దాడులు కూడా జరిగాయి. అలాగే పోలీసులు అతని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకంటే ఆయన ఇలా చేయొద్దు మా పాలన బాగున్న బాగోక పోయినా వైసీపీ వ్యక్తిగా ఉండాలని అన్నారు. అయిన సరే ఆయన తిరగబడి మరి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అయితే రాజేష్ అనే వ్యక్తి మొదట వైసీపీ పార్టీకి వెళ్లి ఆ తర్వాత టీడీపీ పార్టీకి రావడం జరిగింది. అయితే మహాసేన రాజేష్ వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయిన కూడా గత మూడు సంవత్సరాలుగా టీడీపీ లీడర్ గా మంచి పాపులర్ అయ్యాడు.

ఇక ఈ వ్యక్తికి టికెట్ ఇవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటా అని చూస్తే దళిత వర్గానికి చెందిన వ్యక్తి అలాగే కంప్లీట్ గా వై.యస్ జగన్ ను యాంటీ స్టాండ్ గా తీసుకున్న వ్యక్తి మహాసేన రాజేష్. ఇక ఈ రెండు కారణాలు దానితోపాటు మాటల యుద్ధం చాలా స్ట్రాంగ్ గా మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయనకు విష పరిజ్ఞానం ఎంతవరకు ఉన్నా కూడా కాస్త తక్కువగా ఉన్న లాజికల్ గా దానికి సమాధానం చెప్పగలరు. ఇంకాస్త టైం ఇస్తే మాత్రం దానికి లీగల్ గా కూడా సమాధానం చెప్పగల వ్యక్తి. అయితే ఈ విషయాలు అన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్ కు గన్నవరం లో టికెట్ ఇవ్వడం జరిగింది.అయితే ఒక దళిత నాయకుడు ఇలా ఎదుగుతున్నాడు అంటే కచ్చితంగా పార్టీ అధినేతలు వారిని తొక్కే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా చంద్రబాబు ఈయనకి టికెట్ ఇవ్వడం అనేది చాలా వరకు మెచ్చుకోవాల్సిన విషయమే.

అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి దెబ్బ కొట్టబోతున్నారు అంటే..మహాసేన రాజేష్ కు టికెట్ ఇచ్చిన 24 గంటల్లోనే గన్నవరంలో చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి కమ్యూనిటీ ఇంటికి ఆయన వెళ్లడం మొదలుపెట్టారు. 24 గంటలలో దాదాపు ఇప్పటికే 500 లేదా 1000 ఇండ్లను ఆయన కవర్ చేసుకొని వారితో మాట్లాడి వస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఆయన నేను టీడీపీ క్యాండెట్ ని నాకు ఓటేయండి అని కాకుండా నేను ఒక కొత్త క్యాండిడేట్ ని వచ్చాను. మీకు ఉన్న ఎటువంటి సమస్యనైన సరే నేను గెలిచిన ఓడిన నేను మీతో నిలబడతాను అనే ఒక మాట ధైర్యాన్ని వాళ్ళకి ఇచ్చారు. దీంతో గన్నవరంలో వైసీపీ పార్టీ యొక్క ఓట్లు చీలే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక తలకాయ నొప్పి పరిణామం అని చెప్పాలి. మరి ఈ రాజకీయాలపై మీ అనుభవాలను మీ అనాలసిస్ ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది