Mekathoti Sucharitha : ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ దారుణమైన ఓటమి చవిచూడడంతో పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఈ క్రమంలో వైసిపి పార్టీ రోజురోజుకు డీలా పడిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు జనసేన వాళ్ళకి జంపు కాగా… మరికొంతమంది నేతలు బయటికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసిపి కీలక నేత వాసిరెడ్డి పద్మ కూడా… రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధినేత జగన్ తీరు నచ్చకే.. తాను రాజీనామా చేశానంటూ బీభత్సమైన కామెంట్స్ చేసేశారు.
ఇక్కడవరకూ ఓకే. ఇదే వరుసలోకి మరో మేడమ్ చేశారట. 2019లో కీలకశాఖకు ప్రాతినిధ్యం వహించిన సదరు మహిళా నేత.. వైసీపీ వీడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీనే సర్వశ్వం అనుకున్న నేత.. వైసీపీని వీడుతున్నారనే టాక్ చక్కెర్లు కొడుతోందట. వెళ్లిపోతున్న వారంతా.. ఇమడలేక టాటా చెబుతున్నారా.. లేక.. భవిష్యత్‌పై భరోసా లేకా.. అనే అంశంపై.. వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారట.మాజీ హోం శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత… అతి త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లబోతున్నారట. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరుగుతున్నాయట. ఆమెకు జనసేనలో కీలక పదవి ఇస్తారని కూడా… ప్రచారం జరుగుతోంది.
ఈ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ నేత మేకతోటి సుచరిత స్పందించారు. ఇందులో భాగంగా తాను పార్టీ మారబోతున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని ఖండించారు.. వైఎస్ జగన్ తోనే చివరి వరకూ తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి సుచరిత, రిటైర్డ్ ఐఆరెస్ అధికారి మేకతోటి దయాసాగర్ స్పష్టం చేశారు.కొన్ని మీడియా ఛానళ్లు కనీసం తమను ఏమాత్రం సంప్రదించకుండా కావాలని ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నారని స్పందించారు! తమపై పలు టీవీ ఛానళ్లలో వస్తోన్న ఊహాగాణాలు అన్నీ పూర్తి అవాస్తవమని.. గతంలో కూడా తాము టీడీపీలో చేరుతునట్లు ప్రచారం జరిగిందని.. తాము వైసీపీలోనే కొనసాగుతామని అప్పుడు స్పష్టం చేశామని అన్నారు. 2011 సంవత్సరంలో వైసిపి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత.. జగన్ పార్టీలో చేరిపోయారు మేకతోటి సుచరిత. ఈ తరుణంలోనే 2012 ఉప ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది.
Lemon Water : నిమ్మకాయ నీరు సాధారణంగా ఫిట్నెస్ ఔత్సాహికులందరినీ ఏకం చేస్తుంది. ఉదయాన్నే లెమన్ వాటర్ తాగడం నుంచి…
Eye Blurry : ఉదయం లేవగానే ఒకటి లేదా రెండు కళ్లలో చూపు మసకబారడం చాలా మందికి జరుగుతుంది. చాలా…
Samantha : దక్షిణాది బ్యూటీ సమంత ఇప్పటికీ టాలీవుడ్లో క్రేజీ భామగానే ఉంది. ఆమె ఇటీవల నటించిన వెబ్ సిరీస్…
Coffee : ప్రపంచవ్యాప్తంగా కాఫీ అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువగా వినియోగించే పానీయాలలో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా కాఫీ అధిక…
Chandrababu : ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇల్లు మరియు కార్యాలయం సౌరశక్తిని కలిగి ఉండాలని, విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగంలో స్వావలంబన…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతులను నీడ గ్రహాలుగా చెబుతుంటారు.ఇక వీటిని ముఖ్య గ్రహాలుగా పరిగణించకపోయినప్పటికీ ఇవి ముఖ్య…
AP TRANSCO Jobs : విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో ఏపీ ట్రాన్ కో, ఏపీపీసీసీలో…
Karthika Masam : హిందూమతంలో పౌర్ణమి అమావాస్య వంటి వాటిని చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇక ప్రతి నెల అమావాస్య…
This website uses cookies.