Mekathoti Sucharitha : జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న మ‌రో మ‌హిళా నేత‌.. ఏకంగా జ‌న‌సేన‌లోకి జంపా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mekathoti Sucharitha : జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న మ‌రో మ‌హిళా నేత‌.. ఏకంగా జ‌న‌సేన‌లోకి జంపా..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Mekathoti Sucharitha : జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న మ‌రో మ‌హిళా నేత‌.. ఏకంగా జ‌న‌సేన‌లోకి జంపా..!

Mekathoti Sucharitha : ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో వైసీపీ దారుణ‌మైన ఓట‌మి చ‌విచూడ‌డంతో పార్టీకి చెందిన నాయ‌కులు ఒక్కొక్క‌రుగా జారుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వైసిపి పార్టీ రోజురోజుకు డీలా పడిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు జనసేన వాళ్ళకి జంపు కాగా… మరికొంతమంది నేతలు బయటికి వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల వైసిపి కీలక నేత వాసిరెడ్డి పద్మ కూడా… రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధినేత జగన్‌ తీరు నచ్చకే.. తాను రాజీనామా చేశానంటూ బీభత్సమైన కామెంట్స్ చేసేశారు.

Mekathoti Sucharitha మరో నేత‌..

ఇక్కడవరకూ ఓకే. ఇదే వరుసలోకి మరో మేడమ్ చేశారట. 2019లో కీలకశాఖకు ప్రాతినిధ్యం వహించిన సదరు మహిళా నేత.. వైసీపీ వీడుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీనే సర్వశ్వం అనుకున్న నేత.. వైసీపీని వీడుతున్నారనే టాక్‌ చక్కెర్లు కొడుతోందట. వెళ్లిపోతున్న వారంతా.. ఇమడలేక టాటా చెబుతున్నారా.. లేక.. భవిష్యత్‌పై భరోసా లేకా.. అనే అంశంపై.. వైసీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారట.మాజీ హోం శాఖ మంత్రి, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత… అతి త్వరలోనే పార్టీ మారబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలోకి వెళ్లబోతున్నారట. ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తో చర్చలు జరుగుతున్నాయట. ఆమెకు జనసేనలో కీలక పదవి ఇస్తారని కూడా… ప్రచారం జరుగుతోంది.

Mekathoti Sucharitha జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న మ‌రో మ‌హిళా నేత‌ ఏకంగా జ‌న‌సేన‌లోకి జంపా

Mekathoti Sucharitha : జ‌గ‌న్‌కి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న మ‌రో మ‌హిళా నేత‌.. ఏకంగా జ‌న‌సేన‌లోకి జంపా..!

ఈ సమయంలో మాజీ మంత్రి, వైసీపీ నేత మేకతోటి సుచరిత స్పందించారు. ఇందులో భాగంగా తాను పార్టీ మారబోతున్నట్లు వస్తోన్న ప్రచారాన్ని ఖండించారు.. వైఎస్ జగన్ తోనే చివరి వరకూ తమ ప్రయాణం కొనసాగుతుందని మాజీ హోంమంత్రి సుచరిత, రిటైర్డ్ ఐఆరెస్ అధికారి మేకతోటి దయాసాగర్ స్పష్టం చేశారు.కొన్ని మీడియా ఛానళ్లు కనీసం తమను ఏమాత్రం సంప్రదించకుండా కావాలని ఇలాంటి ప్రచారానికి పాల్పడుతున్నారని స్పందించారు! తమపై పలు టీవీ ఛానళ్లలో వస్తోన్న ఊహాగాణాలు అన్నీ పూర్తి అవాస్తవమని.. గతంలో కూడా తాము టీడీపీలో చేరుతునట్లు ప్రచారం జరిగిందని.. తాము వైసీపీలోనే కొనసాగుతామని అప్పుడు స్పష్టం చేశామని అన్నారు. 2011 సంవత్సరంలో వైసిపి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత.. జగన్ పార్టీలో చేరిపోయారు మేకతోటి సుచరిత. ఈ తరుణంలోనే 2012 ఉప ఎన్నికల్లో ప్రతిపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది