
#image_title
Puri Jagannadh : టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్‌లో పూరీ జగన్నాథ్ ఒకరు. ఒకప్పుడు ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. లైగర్ అనే సినిమాతో ఇటీవల డిజాస్టర్ చూసిన పూరీ ఇప్పుడు రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తీస్తున్నాడు. అయితే పూరీ జగన్నాథ్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. పూరీ 28 ఏళ్ల క్రితం లావణ్యని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ఆ మధ్య పూరీకి ఆయన భార్యకి మధ్య విబేధాలు వచ్చాయని వారు విడిపోతారనే టాక్ నడిచింది. కాని వారు మాత్రం ఇప్పటికీ సంతోషంగానే ఉన్నారు. అయితే పూరీ, లావణ్య ప్రేమించి వివాహ చేసుకోగా వారి ప్రేమ విషయంలో కొత్త కోణం ఇప్పుడు బయటకు వచ్చింది.
పెళ్లికి ముందే తన భార్యని వదిలించుకోవాలని పూరీ అప్పట్లో స్కెచ్ వేసినట్టు ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే టాక్ షోలో పూరీ మాట్లాడుతూ..దర్శకుడు అవ్వాలనుకునే రోజుల్లో కొన్ని సినిమాలకు అతను ఘోస్ట్ డైరెక్టర్‌గా పని చేశాడట పూరీ. అయితే ఓ సినిమా షూటింగ్ సమయంలో లావణ్య అక్కడికి వచ్చిందట. ఆమె పూరీ దృష్టిని ఆకర్షించగా , అలానే గంట సేపు చూస్తూ ఉన్నాడట. వైఫ్‌గా తాను తన జీవితంలోకి వస్తే బాగుంటుందని భావించిన పూరీ జగన్నాథ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లావణ్య దగ్గరకు వెళ్లి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇష్టమైతే, ఫోన్ చేయి, లేదంటే చేయకు అని చెప్పాడట. అయితే వారం తర్వాత ఆమె కాల్ చేసి ఎంత మందికి ఇలా కార్డ్స్ ఇచ్చావు అని నిలదీసిందట.
తర్వాత పూరీ గురించి ఆరాలు తీసిందట. మొత్తానికి ఇద్దరు కనెక్ట్ కావడం,కలిసి తిరగడం చేశారు. అయితే ఆ సమయంలో పూరీ దర్శకుడు కాదు కాబట్టి డబ్బులు కూడా పెద్దగా ఉండేవి కావట. ఓ సారి ఆమెని తీసుకొని పూరీ హోటల్‌కి వెళ్లగా ఆమె తందూరి కోడి ఆర్డర్ చేసిందట. అది మొత్తం తినగలమా అని పూరీ అనుకున్నాడట. కానీ తాను మాత్రం మొత్తం తినేసిందట. అది చూసి పెళ్లికి ముందే ఇంత తినేస్తుంది, పెళ్లైతే నా పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డాడట పూరీ. స్ట్రగులింగ్ టైమ్‌లో ఆమెని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటని ఆలోచించిన పూరీ ఆమెని మెల్లగా వదిలించుకోవాలని భావించి డైరెక్ట్‌గా చెప్పేశాడట. పెళ్లి చేసుకున్నాకే కలుద్దామని అన్నాడట. అయితే ఆ తర్వాత వారి పెళ్లి విచిత్రంగా జరిగింది. రెండు కుటుంబాలు వీరి పెళ్లికి ఓకే చెప్పిన కూడా వారు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.