Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్.. ఏం చేశాడంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్.. ఏం చేశాడంటే..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 August 2024,9:19 am

ప్రధానాంశాలు:

  •  Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్.. ఏం చేశాడంటే..!

Midhun Reddy : వైసీపీ ఎంపీ, లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తనపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని.. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయనకు 4+4 సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది నిత్యం ఆయనకు భద్రతగా ఉండనున్నారు.వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్‌ రెడ్డి రాజంపేట నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. అయితే కూటమి సర్కార్‌ అధికారంలోకి రావడంతో పుంగనూరులో ఇప్పుడు టీడీపీ శ్రేణుల నుంచి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయన పుంగనూరులోకి వస్తే చాలు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది.

Midhun Reddy ఇన్‌డైరెక్ట్ కామెంట్స్..

తాజాగా పుంగనూరులో మిథున్‌ రెడ్డి పర్యటించినప్పుడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ వాహనానికి దుండగులు నిప్పు పెట్టారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కి సెక్యూరిటీ గ‌ట్టిగానే ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తాను బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్న మిథున్ రెడ్డి..2014లోనే తనకు బీజేపీ నుంచి ఆఫర్ వచ్చింది.. ఏకంగా కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. 2014లో బీజేపీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసింది..పైగా కూటమిలో నాడు టీడీపీ భాగస్వామిగా ఉంది.

Midhun Reddy వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్ ఏం చేశాడంటే

Midhun Reddy : వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డికి బీజేపీ బంప‌ర్ ఆఫ‌ర్.. ఏం చేశాడంటే..!

ఆ సమయంలో అదీ మొట్ట మొదటి సారి ఎంపీ ఆయిన మిథున్ రెడ్డి చేరిక కోసం బీజేపీ కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసిందని వ్యాఖ్యానించడం నమ్మశక్యం లేదని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. మిథున్ రెడ్డి కొద్ది రోజులక్రితం బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారని కానీ, బీజేపీ నుంచి సరైన సిగ్నల్స్ రాలేదనే ప్రచారం జరుగుతుండటం..ఈ ప్రచారాన్ని ఖండించేందుకు ఈ విషయం వెల్లడించడం పట్ల అందరిలో కొత్త అనుమానాలు రేకెత్తేలా చేస్తున్నాయి. తాజా వ్యాఖ్యల ద్వారా తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే బీజేపీలో చేరుతానని పరోక్షంగా సంకేతాలు పంపారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది