Personal Loan : చాలా చీప్‌గా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.. అది ఎలా అంటారా?
Personal Loan : మన పనులతో మనం బిజీబిజీగా ఉంటుండగా, మధ్యలో పర్సనల్ లోన్ కోసం కాల్స్ వస్తుండడం వాటి వలన మనకు చిరాకు రావడం కూడా జరుగుతుంటుంది. కుటుంబ అవసరాలు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి చాలా మంది పర్సనల్ లోన్ తీసుకుంటారు. మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా వాటిపై ఆధారపడుతుంటారు. అయితే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళితే అవసరాలు తీరడంతో పాటు వ్యాపారాలలో కూడా ప్రగతి సాధించవచ్చు. మిగిలిన రుణాలతో పోల్చితే వ్యక్తిగత రుణాలకు ధ్రువీకరణ పత్రాలు పెద్దగా అవసరం ఉండదు. అయితే బ్యాంకులు వీటిని రిస్క్ గా పరిగణిస్తాయి.
తనఖా పెట్టుకోవడానికి బ్యాంకులలో ఎలాంటి వస్తువులు ఉండవు కాబట్టి వడ్డీ రేటుని బ్యాంకులు గట్టిగానే విధిస్తాయి. అయితే వ్యక్తిగత రుణాలను కూడా తక్కువ వడ్డీ రేటుకు పొందే అవకాశం ఉంది. దానికి కోసం మీరు కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ముందుగా క్రెడిట్ స్కోరు. పర్సనల్ లోన్ ఇచ్చే వారు ముందుగా క్రెడిట్ స్కోరు పరిశీలిస్తారు. దానిని బట్టే రుణం ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తారు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తి తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో మనం తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే క్రెడిట్ స్కోరు మంచిగానే ఉంటుంది. ఇక మనం రుణం తీసుకునే ముందు ఇతర రుసుముల గురించి క్లియర్‌గా పరిశీలించుకోవాలి. వడ్డీ, ఇతర ఖర్చులను ఎంత కలిపారో తెలుసుకోవాలి.
ఇక రుణాలపై వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉండవు. ప్రాసెసింగ్ చార్జీలు కూడా మారుతూ ఉంటాయి. రుణం తీసుకునే ముందు వాటినన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏ బ్యాంకు నిబంధనలు అనుకూలంగా ఉన్నాయో, ఎక్కడ తక్కువ చార్జీలు విధిస్తారో తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంటంఉది. ఇక అప్పు తీసుకున్న తర్వాత వాయిదాలు సకాలంలో చెల్లించగలరో, లేదో లెక్కవేసుకొని దానిని బట్టి ముందుకు వెళ్లాలి. మీకు వస్తున్న ఆదాయం, ఖర్చులతో పాటు అత్యవసరాలకు కూడా కొంత మొత్తాన్ని పక్కన పెట్టి ముందుకు సాగాలి
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
This website uses cookies.