MLA Kethireddy : చంద్రబాబు ఒక స్కామ్ స్టార్.. అసెంబ్లీలో కేతిరెడ్డి స్పీచ్ వింటే మతిపోతుంది.. జగన్ ఫిదా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MLA Kethireddy : చంద్రబాబు ఒక స్కామ్ స్టార్.. అసెంబ్లీలో కేతిరెడ్డి స్పీచ్ వింటే మతిపోతుంది.. జగన్ ఫిదా

 Authored By kranthi | The Telugu News | Updated on :22 September 2023,9:00 pm

MLA Kethireddy : ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలుసు కదా. అసెంబ్లీలో ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని.. అసలు ఆధారాలు లేని కేసును తీసుకొచ్చి ఆయనకు అంటగట్టి అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో అసలు స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో ఎలా స్కామ్ జరిగింది.. అనే దానిపై తేదీలతో సహా చెప్పుకొచ్చాడు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

mla kethireddy speech in ap assembly

#image_title

ఎమ్మెల్యే కేతిరెడ్డి మొత్తం ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ తో సహా అసెంబ్లీలో చూపించాడు కేతిరెడ్డి. దీంతో టీడీపీ నేతలు షాక్ అయ్యారు. అప్పటి వరకు టీడీపీ నేతలు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ రచ్చ రచ్చ చేసి.. చివరకు కేతిరెడ్డి ఆధారాలన్నీ చూపించేసరికి నోర్మూసుకున్నారు. ఇదిగో.. ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ అడుగుతున్నారు కదా.. ఇదిగో చూడండి ప్రూఫ్స్ అంటూ తేదీలతో సహా చెప్పుకొచ్చారు కేతిరెడ్డి. దీంతో సీఎం జగన్ కూడా కేతిరెడ్డి ప్రసంగానికి ఫిదా అయ్యారు. సభలో చప్పట్లు కొట్టారు.

MLA Kethireddy : చంద్రబాబు అరెస్ట్ పై డిటెయిల్ గా అసెంబ్లీలో చెప్పుకొచ్చిన కేతిరెడ్డి

చంద్రబాబు అరెస్ట్ ను సాకుగా చూపి వైసీపీ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని.. అసలు స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో జరిగిన పక్కా స్కామ్ ను పక్కా ఆధారాలతో అసెంబ్లీలో కేతిరెడ్డి నిరూపించడంతో సీఎం జగన్ అయితే ఫిదా అయ్యారు. చంద్రబాబు అంటే ఏదో స్టార్ కాదు.. స్కామ్ స్టార్. ఈయన చరిత్ర అందరికీ తెలుసు. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈయన అందరినీ తింగరోళ్లను చేస్తాడు.. అంటూ చంద్రబాబు చరిత్ర మొత్తం ఏపీ అసెంబ్లీ వేదికగా బయటపెట్టాడు కేతిరెడ్డి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది