TDP : పెద్ద స్కెచ్ తోనే టీడీపీలోకి దిగుతోన్న కోటంరెడ్డి, ఆనం.. కానీ..!
TDP : ఏపీలో ఎన్నికలకు ఇంకా ఒక సంవత్సరం మాత్రమే సమయం ఉంది. అందుకే ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీ కంటే ఒక అడుగు ఎప్పుడూ ముందుండాలని టీడీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ ఆపరేషన్ నెల్లూరును ప్రారంభించింది. నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేలను వైసీపీ అధిష్ఠానం బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో వాళ్లంతా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇప్పటికే ఆనం రామనారాయణ రెడ్డి సమావేశమయ్యారు. తన ఇంటికి టీడీపీ నేతలను బ్రేక్ ఫాస్ట్ కు ఆయన ఆహ్వానించారు.
కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ చేరిక కన్ఫమ్ అయినట్టే. ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరి చేరికపై క్లారిటీ వచ్చేసింది. ఈనెల 13 నుంచి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కూడా ప్రారంభం కానుంది. ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలతో పాటు.. పార్టీలో ముఖ్య నేతల చేరికలు ఉంటే.. పార్టీలో మరింత జోష్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబుతో ఆనం రామనారాయణరెడ్డి సమావేశం అయ్యారు. అలాగే.. అనుచరులతో సమావేశం అయ్యాక అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
TDP : కోటంరెడ్డి నివాసంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
కోటంరెడ్డి నివాసానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వెళ్లారు. తన అనుచరులతోనూ కోటంరెడ్డి సమావేశం అయ్యారు. మాజీ మంత్రి అమర్నాథ్ తో పాటు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర కూడా వచ్చారు. కోటంరెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపారు. వీళ్లంతా కోటంరెడ్డిని టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానించారు. అందుకే కోటంరెడ్డి వైసీపీకి రాజీనామా ప్రకటించే అవకాశం ఉంది. వెంటనే నారా లోకేష్ పాదయాత్రలోపు టీడీపీలోకి వాళ్లు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట కావడంతో నెల్లూరు జిల్లాలో పట్టు పెంచుకునే క్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాను టార్గెట్ చేసింది. అందుకే ఇప్పటి నుంచే టీడీపీ ముందస్తు కసరత్తు ప్రారంభించింది.