YS Vijayamma : తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి..?? కూతురికా.. ? కొడుకుకా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Vijayamma : తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి..?? కూతురికా.. ? కొడుకుకా..?

 Authored By aruna | The Telugu News | Updated on :19 January 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  YS Vijayamma : తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి..?? కూతురికా.. ? కొడుకుకా..?

YS Vijayamma : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయింది. వైయస్ కుటుంబంలో ఏర్పడిన చిచ్చు చివరికి అన్నా చెల్లెళ్ల మధ్య పోరాటంగా మారుతుంది. ఈ క్రమంలో ఇద్దరిలో తల్లి సపోర్ట్ ఎవరికి అన్న చర్చ కూడా ప్రారంభమైంది. తల్లి విజయమ్మ ఎవరో ఒకరి వైపు ఉన్నా ఫ్యామిలీ బ్యాలెన్స్ తప్పుతుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఆమె సోదరుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ అధినేతగా, సీఎంగా ఉన్నారు. గతంలో అన్న పార్టీ కోసం షర్మిల పాదయాత్ర కూడా చేశారు. కానీ కారణాలేంటో తెలియదు కానీ చెల్లి షర్మిలను జగన్ దూరం పెట్టడంతో ఆమె తన రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. కానీ అక్కడ రాజకీయ పరిస్థితులను చూసిన తర్వాత మనసు మార్చుకొని ఏపీ లోకి వచ్చారు. తండ్రి వైయస్ జీవితాంతం ఉన్న కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయ్యారు.

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తల్లి విజయమ్మ పూర్తి మద్దతుగా నిలిచారు. పిల్లలిద్దరూ చెరొక రాష్ట్రంలో రాజకీయం చేయాలని దేవుడు రాసి పెట్టారని చెప్పుకున్నారు. తెలంగాణలో వైఎస్ఆర్ సీపీ పోటీ చేయటం లేదు కాబట్టి అన్నా చెల్లెలు మధ్య సవాల్ జరిగే అవకాశం కనిపించలేదు. అందుకే విజయమ్మకు కూడా ఇద్దరి మధ్య ఎవరో తేల్చుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంది. షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. తన అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరారు. ఇలాంటి సమయంలో తల్లి విజయమ్మ సపోర్ట్ ఎవరికి అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు విజయమ్మ కూతురి వైపే మొగ్గు చూపారు. కూతురికి అండగా నిలబడటమే ప్రాధాన్యంగా తీసుకున్నారు.

వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేసినప్పుడు విజయమ్మ అదే చెప్పారు. ఇద్దరూ బిడ్డలు రెండు రాష్ట్రాలలో రాజకీయం చేస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒకరిపై మరొకరు రాజకీయం చేసే పరిస్థితి వచ్చింది. అయితే షర్మిల ఏపీలోకి వచ్చేముందు షర్మిలని కట్టడి చేయాలని తల్లి విజయమ్మను జగన్ ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక ఇద్దరి పిల్లలు తన రెండు కళ్ళు అని విజయమ్మ చెబుతూ వస్తున్నారు. అయితే ఆమె రెండు కళ్ళలో ఒక కంటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందని వాదన. షర్మిల వైపే విజయం నిలబడితే జగన్ కు నైతికంగా భారీ దెబ్బ తగిలినట్టే అని భావిస్తున్నారు. ఇప్పటికే తల్లి, చెల్లెలిని పట్టించుకోవడంలేదని విమర్శలు జగన్ ఎదుర్కొంటున్నారు. ఇక షర్మిల నేరుగా రాజకీయ రంగంలోకి దిగారు. కాబట్టి జగన్ ను విమర్శించే పరిస్థితి వస్తుంది. ఇక విజయమ్మ ఎవరికి సపోర్ట్ ఇవ్వాలో తేల్చుకోలేని పరిస్థితి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది