Mudragada : వైసీపీలోకి ఎంట్రీ ఇస్తూనే ముద్రగడ ఏం చేసాడో చూడండి.. పవన్ కళ్యాణ్ కి గట్టి దెబ్బ?
Mudragada : ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. అందుకే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రతో ఫుల్ టు బిజీ అయిపోయారు. ఆయన అధికార వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ కూడా ఊరికే ఉండటం లేదు. పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇస్తోంది. రివర్స్ అటాక్ చేస్తోంది. అయినా పవన్ ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు ముఖ్యమైన నేతలను తమ పార్టీల్లోకి చేర్చుకోవడం కోసం అన్ని పార్టీలు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ పలు లేఖలు రాశారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే పిఠాపురం నుంచి పోటీ చేయాలని సవాల్ విసిరారు. అంటే.. ముద్రగడ ఈసారి ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని కన్ఫమ్ అయింది. అంతే కాదు.. ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ కూడా వచ్చేసింది. ముద్రగడ వైసీపీలో చేరడంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చేశారు.ముద్రగడ పార్టీలోకి వస్తే మాకు హ్యాపీనే అని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ముద్రగడ వైసీపీలోకి వస్తానంటే మేము ఎప్పుడైనా ఆహ్వానిస్తాం. కాకపోతే ముద్రగడ పార్టీలోకి వచ్చే అంశం సీఎం స్థాయికి సంబంధించింది..
Mudragada : ముద్రగడ పార్టీలోకి వస్తే మాకు హ్యాపీనే
ఆ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాదు.. చంద్రబాబు సీఎం కావాలని.. పవన్ కళ్యాణ్ తెగ పోరాటం చేస్తున్నారని.. తన అభిమానులు, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అసలు జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పాలంటూ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. కాకినాడ అంటేనే అది కాపుల అడ్డా అంటూ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. కాపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయకుండా వాళ్ల ఓట్ల కోసమే కుయుక్తులు పన్నుతున్నారని తెలిపారు.