Mudragada VS Pawan Kalyan : పిఠాపురంలో వేడెక్కిన రాజకీయాలు… పవన్ కు పోటీగా వైసీపీ నుండి ముద్రగడ…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mudragada VS Pawan Kalyan : పిఠాపురంలో వేడెక్కిన రాజకీయాలు… పవన్ కు పోటీగా వైసీపీ నుండి ముద్రగడ…!

Mudragada VS Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసిపి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ మరియు జనసేన పార్టీలకు గట్టి షాక్ ఇస్తూ వస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాపు వర్గ ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ ముద్రగడ్డ పద్మనాభం […]

 Authored By tech | The Telugu News | Updated on :9 March 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Mudragada VS Pawan Kalyan : పిఠాపురంలో వేడెక్కిన రాజకీయాలు... పవన్ కు పోటీగా వైసీపీ నుండి ముద్రగడ...!

Mudragada VS Pawan Kalyan : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసిపి పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమిగా ఏర్పడినటువంటి టీడీపీ మరియు జనసేన పార్టీలకు గట్టి షాక్ ఇస్తూ వస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాపు వర్గ ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ ముద్రగడ్డ పద్మనాభం వైసీపీ పార్టీలోకి తీసుకుని వచ్చేందుకు వ్యూహాలను రచిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొందరు వైసీపీ నేతలు వెళ్లి ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరుపగా వైసీపీ పార్టీలోకి చేరేందుకు ముద్రగడ పద్మనాభం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కువ శాతం కాపు వర్గానికి చెందిన ఓట్లు ఉండడంతో జనసేన అధినేత ఇక్కడి నుండి బరిలో దిగేందుకు ఏర్పాటు చేసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కు పోటీగా కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీ నుండి ఒకరిని పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేపించాలనే దిశగా వైసీపీ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అయితే మొన్నటి వరకు ముద్రగడ్డ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే టీడీపీ తో పొత్తు మరియు చంద్రబాబు చెప్పిన ప్రతిదానికి పవన్ తల ఊపడం , అదేవిధంగా తన ఇంటికి పలుమార్లు వస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ మాట తప్పడంతో ఆ పార్టీని విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఇక ఈ అంశాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ముద్రగడ్డ పవన్ కళ్యాణ్ కు ఘాటు లేక కూడా రాసిన విషయం తెలిసిందే.

ఇక అప్పటినుండి రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న ముద్రగడ్డను ఇప్పుడు వైసీపీ తమ పార్టీలో చేర్చుకుని పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పై పోటీ చేపించేందుకు పూనుకుంది. దీంతో ఇటీవల ముద్రగడ పద్మనాభంతో చర్చలు జరిపిన వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాపు సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉన్న పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పై ముద్రగడ్డను వైసీపీ పార్టీ బరిలో దింపుతున్నట్లు గా తెలుస్తోంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉండటంతో ముద్రగడను దింపితే వైసీపీ కచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాలి. మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి రచించిన ఈ వ్యూహం రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది