Mudragada Padmanabham : కాపులు ఎవ్వరు చంద్రబాబును నమ్మొద్దు… ముద్రగడ పద్మనాభం..
ప్రధానాంశాలు:
Mudragada Padmanabham : కాపులు ఎవ్వరు చంద్రబాబును నమ్మొద్దు... ముద్రగడ పద్మనాభం..
Mudragada Padmanabham : ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలన్నీ కూడా విస్తృతస్థాయిలో ప్రచారాలను చేపడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోని ఏపీ ఎన్నికల్లో కాపు అధ్యక్షులు ముద్రగడ పద్మనాభం టాప్ గేర్ వేశారు. కూటమిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ కాపులకు చేస్తున్నటువంటి అన్యాయాల గురించి ఆయన నోరు విప్పారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చానియాంశంగా మారాయి.
Mudragada Padmanabham : బాబును నమ్మితే నట్టేట మునిగినట్లే…
ఈ నేపథ్యంలోనే కాపులు మరోసారి చంద్రబాబును నమ్మినట్లయితే నట్టేట మునిగినట్లే అంటూ ఉభయగోదావరి జిల్లాల్లో వినూత్న ప్రచారాలకు ముద్రగడ పద్మనాభం శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈస్ట్ వెస్ట్ లో ప్రతి ఇంటికి వెళ్లి కాపు సోదరులను ముద్రగడ్డ కలుస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ గా చెప్పుకుంటూ వస్తున్న బాబు మొదటినుండి కూడా కాపులను మోసం చేస్తూనే ఉన్నారని ముద్రగడ తెలియజేస్తున్నారు. ఇక ఇప్పుడు కూటమిని నమ్మి గెలిపిస్తే మరోసారి కాపులు మోసపోతారని ఇకనైనా కాపు నేతలు ఓటర్లు మేలుకోవాలని చంద్రబాబును అస్సలు నమ్మొద్దని హితోవ చెబుతున్నారు.
Mudragada Padmanabham : గెలిచాక కాపులను కరివేపాకుల తీసేస్తాడు…
మరో నాలుగు రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను చూసి, చంద్రబాబును నమ్మి ఓటు వేస్తే గెలిచిన తర్వాత ప్రజలే తనని గెలిపించారని కాపులను చంద్రబాబు కరివేపాకుల చూస్తారని ముద్రగడ పద్మనాభం ప్రజలందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నారు. అంతెందుకు 2014లో గెలిచిన తర్వాత పొత్తుపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ ఏం చెప్పారు అనే విషయాలను మరోసారి గుర్తు చేస్తున్నారు. అప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ మీతో పొత్తు పెట్టుకోకపోతే నాకు మరో 10 సీట్లు ఎక్కువ వచ్చేవని చంద్రబాబు అన్న మాటలు గుర్తు చేశారు. ఇది చంద్రబాబు అసలు స్వరూపమని అలాంటి చంద్రబాబును నమ్మి మళ్ళీ ఓటు వేస్తే గెలిచిన తర్వాత మనకు మట్టే మిగులుతుందని ముద్రగడ పద్మనాభం హిత బోధ చేస్తున్నారు. అందుకే ఈసారి చంద్రబాబును ఓడించమని 2029లో 50 స్థానాల్లో గెలిచి పవర్ షేరింగ్ తీసుకుందామని చెబుతున్నారు. ఇది పక్కా అంటూ ముద్రగడ్డ తెలియజేశారు.
ఇక ఇప్పుడు చంద్రబాబుకు ఓటేస్తే 2029లో మనకు కనీసం 20 సీట్లు కూడా ఇవ్వడని ప్రతి కాపు సోదరుని కలిసి ముద్రగడ పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా బాబు చేతుల్లో మోసపోతామంటూ తెలియజేస్తున్నారు. కాపుల ఓట్లతో గెలిచి తర్వాత హ్యాండ్ ఇవ్వడంలో ఆయనను మించిన వారు లేరని ముద్రగడ ప్రచారాలు చేస్తున్నారు. అందుకే కాపు సోదరులు అందరూ ఆలోచించాలని ఆచితూచి ఓటు వేయాలని సూచిస్తున్నారు. మరి ముద్రగడ పద్మనాభ చేపడుతున్న ఈ సరికొత్త ప్రచారాలు కూటమికి ఏ విధంగా నష్టాన్ని చేకూరుస్తాయో చూడాలి మరి.