Nadendla Manohar : పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబుకి సీఎం పదవి అంటూ నాదెండ్ల సంచలన కామెంట్స్
ప్రధానాంశాలు:
Nadendla Manohar : పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబుకి సీఎం పదవి అంటూ నాదెండ్ల సంచలన కామెంట్స్
Nadendla Manohar : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒకవైపు వైసీపీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వర్మని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, జనసేన పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.

Nadendla Manohar : పవన్ కళ్యాణ్ వల్లనే చంద్రబాబుకి సీఎం పదవి అంటూ నాదెండ్ల సంచలన కామెంట్స్
Nadendla Manohar సంచలన కామెంట్స్
వర్మ గారు చాలా సీనియర్ రాజకీయవేత్త అని వెల్లడించారు. ఆయన కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారని, గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరం చూశామని వివరించారు. అయితే, పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఆయా పార్టీల అధిష్ఠానాలు నిర్ణయం తీసుకుంటాయని నాదెండ్ల స్పష్టం చేశారు. వర్మ విషయం కూడా టీడీపీ అంతర్గత వ్యవహారమని పేర్కొన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే. ఒక్క ఓటు కూడా చీలకూడదని పవన్ కళ్యాణ్ ఆ రోజు నిర్ణయం తీసుకోవడం వల్లనే కూటమి ప్రభుత్వం వచ్చిందని జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.