Nagababu : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు.. పవన్ అనూహ్య నిర్ణయం
ప్రధానాంశాలు:
Nagababu : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు.. పవన్ అనూహ్య నిర్ణయం
Nagababu : ఏపీ రాజకీయాలు AP Politics ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి. బడ్జెట్ Budjet లో ప్రతిపాదించిన పథకాల అమలు పైన ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక, ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు – పవన్ చర్చించారు. నాగబాబుకు ఎమ్మె ల్సీ ,మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు.

Nagababu : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నాగబాబు.. పవన్ అనూహ్య నిర్ణయం
Nagababu నాగబాబుకి కీలక పదవి..
నాగబాబు రాజకీయంగా గత కొంతకాలంగా జనసేన Janasenaలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. 2019లో నరసాపురం లోకసభ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలైనా, పార్టీ కార్యకలాపాల్లో అంతా ముందుండి పని చేస్తున్నారు. తాజా నిర్ణయం ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రాముఖ్యత కల్పించనుంది. జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి నాగబాబుకు కేటాయించినట్లు నిర్ణయించారు.
నాగబాబును త్వరలోనే రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకురావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, గతంలో టీడీపీ TDPఅధినేత చంద్రబాబు కూడా ఆయనకు మంత్రిపదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. నాగబాబు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొంటారని, పార్టీకి ఇది మరింత బలం చేకూరుస్తుందని నాయకత్వ వర్గం భావిస్తోంది.