Nagababu : చంద్రబాబుపై నాగబాబు సెటైర్లు.. మరో చిచ్చు రాజేశాడా..?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: March 22, 2024, 2:23 pm
  •  Nagababu : చంద్రబాబుపై నాగబాబు సెటైర్లు.. మరో చిచ్చు రాజేశాడా..?

Nagababu : ఏపీలో ఇప్పుడు కూటమి రాజకీయాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా టీడీపీ TDP , జనసేన Janasena పొత్తులు పెట్టుకున్నాయి. అయితే జగన్ Ys jagan ను ఎదుర్కోవాలంటే ఈ బలం సరిపోదనుకున్నారేమో.. వెంటనే బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకుసుకుని కూటమిగా ఏర్పడ్డారు. దాంతో ఇప్పుడు మూడు పార్టీల మధ్య సయోధ్య కుదరక నానా రచ్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. దాంతో పాటు అటు బీజేపీ BJP నేతలు కూడా తమకు ఓడిపోయే చోట్ల సీట్లు ఇచ్చారంటూ రగిలిపోతున్నారు. ఇటు జనసేన కూడా అంతే.

తమకు గౌరవ ప్రదమైన సీట్లు ఇవ్వలేదని జనసైనికులు రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు నాగబాబు నిప్పులు ఉప్పేస్తున్నారు. ఆయన ఈ నడుమ చేసే ట్వీట్లు వ్యంగ్యంగా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే టీడీపీని ఇన్ డైరెక్టుగా టార్గెట్ చేస్తున్నట్టే ఉంటున్నాయి. ఆ మధ్య టీడీపీ రెండు సీట్లు ప్రకటిస్తే.. పవన్ Pawan kalyan కూడా రెండు సీట్లు ప్రకటించుకున్నారు. ఆ సమయంలో నాగబాబు ఓ ట్వీటేశాడు. టీడీపీని దెబ్బకు దెబ్బ తీశామని చెప్పుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో ట్వీటేశాడు. ఇది నేరుగా చంద్రబాబుకు తగిలే విధంగానే ఉంది.

Nagababu : చంద్రబాబుపై నాగబాబు సెటైర్లు.. మరో చిచ్చు రాజేశాడా..?

Nagababu : చంద్రబాబుపై నాగబాబు సెటైర్లు.. మరో చిచ్చు రాజేశాడా..?

ఆయన తాజాగా ఎక్స్ లో ఈ విధంగా పోస్టు చేశాడు. ‘ వయసు ఎక్కువ, పెద్ద వాడు అని ప్రతి వెధవను గౌరవించనక్కరలేదు. ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లు అవుతారు’ అంటూ చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూషియస్‌ కోట్ ను నాగబాబు పోస్టు చేశారు. ఈ మాటలు చంద్రబాబును ఉద్దేశించే చేశాడంటూ టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఎందుకంటే ఈ నడుమ జనసేనకు కేటాయించిన సీట్లలో అభ్యర్థులను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నాడంటూ జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగబాబు ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల అది కచ్చితంగా చంద్రబాబును ఉద్దేశించే చేశాడని టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. దాంతో ఇప్పుడు రెండు పార్టీల నడుమ చిచ్చు మరోసారి రాజుకుంది. ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp