Nagababu : మరోసారి మంత్రి రోజాపై రెచ్చిపోయిన నాగబాబు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagababu : మరోసారి మంత్రి రోజాపై రెచ్చిపోయిన నాగబాబు ..!

 Authored By aruna | The Telugu News | Updated on :18 December 2023,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagababu : మరోసారి మంత్రి రోజాపై రెచ్చిపోయిన నాగబాబు ..!

Nagababu : తనకు రెండు ఓట్లు ఉన్నాయి అన్న వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు తాజాగా స్పందించారు. వివాదాస్పదం అవడం ఇష్టం లేకనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదు అన్నారు. ఏపీ తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం పై నాగబాబు పై వివాదాస్పదం అయింది. ఈ విషయంపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల నాగబాబు కుటుంబం ఖైరతాబాద్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలోని మంగళగిరిలో ఆయన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇక ఈ వివాదం పై స్పందించిన నాగబాబు హైదరాబాదులో తనకున్న ఓటు రద్దు చేసుకున్నానని, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. తన ఓటును ఏపీకి మార్చుకుని టీడీపీ, జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీ వాళ్లు కావాలని దీనిని వివాదం చేస్తున్నారు అని నాగబాబు అన్నారు. తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాజకీయాలకు సంబంధించిన ఓ కామెడీ మ్యాగజైన్ వార్త రాసిందని సెటైర్స్ వేశారు. తన భార్య పిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నామని, మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓట్లు రాకుండా బూత్ స్థాయిలోను వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు.

ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందని, టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన అంటే అపహాస్యంగా ఉందని, చివర్లో నోట్ లు ఇస్తే ఓట్లు వేస్తారని గుడ్డి నమ్మకంతో ఉన్నారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పుడు అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన, టిడిపి కలిసి ప్రజా సమస్యలకే పోరాడుతామని అన్నారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జనసేన, టీడీపీ కూటమిని గెలిపించాలని అన్నారు. అధికార పార్టీ వాళ్లు మళ్లీ తామే గెలుస్తామని అహంకారంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి అని అన్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది