Nagababu : పుట్టుక‌తోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ స‌మ‌స్య ఉందంటూ సీక్రెట్ లీక్ చేసిన నాగ‌బాబు | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Nagababu : పుట్టుక‌తోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ స‌మ‌స్య ఉందంటూ సీక్రెట్ లీక్ చేసిన నాగ‌బాబు

Nagababu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా, తిరుగులేని వ్యూహాన్ని రచించిన పవన్ కల్యాణ్ గురించే అందరి నోట వస్తున్న మాట భేష్.. పవన్ కల్యాణ్ గురించి వెలువడుతున్న కథనాలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి కూడా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని పవన్ కల్యాణ్ శపథమే చేశాడు. తాను పట్టుబట్టి ఎడమొఖం.. పెడ మొఖం ఉన్న టీడీపీ, బీజేపీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Nagababu : పుట్టుక‌తోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ స‌మ‌స్య ఉందంటూ సీక్రెట్ లీక్ చేసిన నాగ‌బాబు

Nagababu : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది.ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా, తిరుగులేని వ్యూహాన్ని రచించిన పవన్ కల్యాణ్ గురించే అందరి నోట వస్తున్న మాట భేష్.. పవన్ కల్యాణ్ గురించి వెలువడుతున్న కథనాలు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. ఎన్నికలకు ముందు నుంచి కూడా అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తానని పవన్ కల్యాణ్ శపథమే చేశాడు. తాను పట్టుబట్టి ఎడమొఖం.. పెడ మొఖం ఉన్న టీడీపీ, బీజేపీ పార్టీలను ఏకం చేశాడు. పొత్తుల్లో భాగంగా తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవడానికి తనకు కేటాయించిన సీట్లను వదులుకొని త్యాగానికి సిద్దపడ్డాడు. అందుకు కారణం వైఎస్ జగన్ పతనం చూడటమే.

Nagababu సీక్రెట్స్ ఔట్..

ఎన్నికల తర్వాత తాను పోటీ చేసిన అన్ని స్థానాలు అంటే.. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించడం సరికొత్త చరిత్రగా మారింది. ఇప్పుడు 100 శాతం స్ట్రైక్ రేట్ అనేది జాతీయ మీడియాలో ఊతపదంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పవన్ కల్యాణ్ గురించి తెగ వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా నాగ‌బాబు ఓ ఇంట‌ర్వ్యూలో ప‌వన్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.చిన్న తనంలో అమ్మ మమ్మల్ని చదవండి అని బాగా విసిగించేది అట. అమ్మకి అన్నయ్య అంటే బాగా ఇష్టం. అమ్మకి ప్రతి పనిలో అన్నయ్య సాయం చేసేవాడు. న‌న్ను బాగా కొట్టేది అని చెప్పాడు. కళ్యాణ్ బాబు అంటే అందరికి స్పెషల్.. ఎందుకంటే కళ్యాణ్ బాబు ఆరోగ్యంగా పుట్టిన బేబీ కాదు. చాలా బలహీనంగా పుట్టాడు.

Nagababu పుట్టుక‌తోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ స‌మ‌స్య ఉందంటూ సీక్రెట్ లీక్ చేసిన నాగ‌బాబు

Nagababu : పుట్టుక‌తోనే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఆ స‌మ‌స్య ఉందంటూ సీక్రెట్ లీక్ చేసిన నాగ‌బాబు

దీనితో కళ్యాణ్ బాబుని అమ్మ ఎంతో కేరింగ్ తో చూసుకుంది. నాన్నకి మాత్రం విపరీతమైన కోపం. ఎలాంటి కోపం వచ్చినా నాన్న ముందుగా పెద్ద కొడుకు అన్నయ్య కాబట్టి ఆయన్నే తిట్టేవారు అని నాగ‌బాబు అన్నారు. పెద్దయ్యాక కూడా కొడుకుల కోసం అంజనాదేవి స్పెషల్ వంటకాలు చేస్తుందట క‌దా అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, కళ్యాణ్ బాబుకి పులావ్ బాగా ఇష్టం. తినాలని అనిపించినప్పుడు ఏదైనా వండి పంపొచ్చు కదమ్మా అని అడుగుతాడు. అమ్మ కూడా ఎప్పుడు అడుగుతాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. స్పెషల్ గా పులావ్ వండి పంపిస్తుంది అని చెప్పుకొచ్చాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది