Nara Lokesh : కొద్ది రోజులుగా కనిపించని నారా లోకేష్.. సడెన్‌గా తెరమరుగు కావడానికి కారణం ఏంటి?
ప్రధానాంశాలు:
Nara Lokesh : కొద్ది రోజులుగా కనిపించని నారా లోకేష్.. సడెన్‌గా తెరమరుగు కావడానికి కారణం ఏంటి?
Nara Lokesh : ఈ సారి ఎన్నికల ప్రచారాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. కూటమితో పాటు వైసీపీ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నారు. ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి తరుపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.ఉమ్మడిగా సభలు , సమావేశాలు నిర్వహిస్తూ వైసిపి పై నిప్పులు చెరుగుతూ హాట్ టాపిక్ అవుతున్నారు. జగన్ అధికారంలోకి రాకుండా చేయడమే తమ పార్టీ లక్ష్యం అంటూ వారు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా పదే పదే ప్రకటనలు చేస్తూ, ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల మేనిఫెస్టోలోని పథకాలని విస్తృతంగా జనాలలోకి తీసుకెళుతున్నారు.
Nara Lokesh : తెరమరుగైన లోకేష్..
అయితే టీడీపీ పార్టీలో కీలక నాయకుడిగా, యువ నేతగా గుర్తింపు పొందిన లోకేష్ కేవలం తాను పోటీ చేయబోతున్న నారా లోకేష్ ఎక్కువగా ఈ మధ్య కనిపించడం లేదు. మంగళగిరి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడం , రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు ఆయన అంతగా ఆసక్తి చూపించకపోవడం వెనుక కారణాలు చాలా కనిపిస్తున్నాయి. మంగళగిరి ఈసారి లోకేష్ కి అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి అందుకే ఆయన అక్కడే ఉంటూ ప్రచారంలో వేగం పెంచుతున్నారని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి వైసిపి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి చెందిన లోకేష్‌ని మళ్లీ ఓడించేందుకు వ్యూహం రచిస్తున్న వైసిపి తమ అభ్యర్థిగా మురుగుడు లావణ్యను ప్రకటించింది.
నిజానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్న టాక్ కూడా ఉంది. ఈ సారి చంద్రబాబు గెలిస్తే మెల్లగా తన బాధ్యతలన్నింటిని కూడా లోకేష్‌కి అప్పగిస్తారన్న ప్రచారం కూడా సాగింది. అయితే తాను మంగళగిరి నియోజకవర్గానికి పరిమితం కావడంపై రాజకీయంగా తనపై విమర్శలు వచ్చినా అవేమి పట్టించుకోనట్లుగానే లోకేష్ వ్యవహరిస్తున్నారు. మొత్తానికి చూస్తే గడచిన రెండు నెలలుగా లోకేష్ ఎక్కడా రాష్ట్ర స్థాయి సభలలో పాల్గొనకపోవడం మాత్రం చర్చనీయాంశం అవుతుంది.