Ration Card : ఏపీలో కొత్త రేషన్‌కార్డు దారులకు కొత్త చిక్కొచ్చి పడింది..!
ప్రధానాంశాలు:
Ration Card : ఏపీలో కొత్త రేషన్‌కార్డు దారులకు కొత్త చిక్కొచ్చి పడింది..!
Ration Card : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి, లబ్దిదారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ‘వాట్సాప్ గవర్నెన్స్ – మన మిత్ర’ యాప్ ద్వారా దరఖాస్తు చేసే అవకాశం ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు ఆన్‌లైన్ సర్వర్లు మొరాయిస్తుండడంతో, దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో గ్రామ, వార్డు సచివాలయాలవైపు పరుగులు పెడుతున్నారు. దరఖాస్తులు భారీగా రావడంతో సర్వర్‌లో లోపాలు ఏర్పడి, సిబ్బంది దరఖాస్తులను తిరస్కరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Ration Card : ఏపీలో కొత్త రేషన్‌కార్డు దారులకు కొత్త చిక్కొచ్చి పడింది..!
ఈ నెల 7వ తేదీ నుంచి ప్రభుత్వం పది రకాల రేషన్ సేవలకు దరఖాస్తులు స్వీకరించాలని అనుమతి ఇచ్చింది. ఇందులో కొత్త రేషన్ కార్డులు, ఉన్న కార్డుల విభజన, కొత్త సభ్యుల చేర్పు, సభ్యుల తొలగింపు, చిరునామా మార్పు, ఆధార్ సీడింగ్ సవరణ, అనర్హుల కార్డుల సరెండర్ వంటి సేవలు ఉన్నాయి. ఒక్క 10 రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 2.44 లక్షల దరఖాస్తులు అందాయి. ఇందులో ఎక్కువగా కొత్త సభ్యుల చేర్పుల కోసం దరఖాస్తులు వచ్చాయి. పెళ్లయిన జంటలు, విడిగా ఉండే కుటుంబాలు, కొత్తగా అర్హత పొందిన పేదవారు పెద్ద ఎత్తున సచివాలయాలకు రావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.
సర్వర్ల పని దెబ్బతినడం, వర్చువల్ ప్లాట్‌ఫాంలు అందుబాటులో లేకపోవడం వల్ల లబ్దిదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క తీవ్రమైన ఎండా , మరోపక్క సర్వర్లు మొరాయిస్తుండడంతో దరఖాస్తుల దారులతో సచివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ‘వాట్సాప్ గవర్నెన్స్’ సౌకర్యాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకువస్తే, ప్రజలకు చాలా రీతుల్లో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. తద్వారా సచివాలయాలపై పెరిగిన ఒత్తిడిని తగ్గించవచ్చు. ప్రస్తుతం పెరిగిన దరఖాస్తు రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాంకేతిక సమస్యల పరిష్కారంపై వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది.