AP Survey Results : ఏపీలో వైరల్ అవుతున్న కొత్త సర్వే… లోకేష్ పవన్ పోటీ చేస్తున్న స్థానాలలో ఫలితాలు చూస్తే….!
ప్రధానాంశాలు:
AP Survey Results : ఏపీలో వైరల్ అవుతున్న కొత్త సర్వే... లోకేష్ పవన్ పోటీ చేస్తున్న స్థానాలలో ఫలితాలు చూస్తే....!
AP Survey Results : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలతో పాటు సర్వే సంస్థల సందడి కూడా మొదలైందని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ సర్వే సంస్థల యొక్క సర్వేలు రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోని కొన్ని సర్వే సంస్థలను ప్రజలు నమ్ముతుంటే మరికొన్ని సర్వే సంస్థలను మోసపూరిత సర్వేలుగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోని 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు సీజన్ రావడంతో ఇటీవల జాతీయస్థాయిలో పలు సర్వే సంస్థల నుండి అనేక రకాల ఫలితాలు తెరపైకి వస్తున్నాయి.ఇక వీటిలో ప్రధానంగా మెజారిటీ సర్వే ఫలితాలు మాత్రం వైసీపీ పార్టీకి అనుకూలం ఉన్నట్లు చూపిస్తున్నాయి.. ఈ క్రమంలోనే తాజాగా ఓ సర్వే సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారాయి.
AP Survey Results : 175 నియోజకవర్గాలలో 90 వేల శాంపిల్స్…
అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆంధ్ర సర్వే న్యూస్ ఏ.ఏల్.ఎన్ సంస్థ తాజాగా సర్వే ఫలితాలను నియోజకవర్గాల వారిగా విడుదలు చేసింది. ఇక ఈ సర్వే ఫలితాలను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో దాదాపు 90,604 శాంపిల్స్ ను సేకరించి విడుదల చేసినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ కి 51% ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. అలాగే టీడీపీ కూటమికి 41% , కాంగ్రెస్ పార్టీకి 4 శాతం ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే తెలిపింది.
AP Survey Results : సీట్ల విషయానికొస్తే…
ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి దాదాపు 149 స్థానాలలో విజయం లభిస్తుందని ఈ సర్వే వెల్లడించింది. అలాగే టీడీపీ కూటమికి కేవలం 26 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఈ సర్వే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీలకు వచ్చే మెజారిటీ ఓట్లను కూడా ఈ సర్వే సంస్థ అంచిన వేసి చెప్పింది.
AP Survey Results : నియోజకవర్గాల వారీగా చూస్తే…
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని సర్వే వెల్లడించింది. దీనిలో భాగంగా ఈ నియోజకవర్గంలో దాదాపు 21,000 పైగా మెజారిటీ ఓట్లు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పంలో 19000 మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందని సర్వే ఫలితాలు కన్ఫర్మ్ చేశాయి…
AP Survey Results : లోకేష్ , పవన్ కు మళ్లీ తప్పని ఓటమి.
అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ కు మరోసారి ఓటమి తప్పదని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం లో జనసేన దాదాపు 7000 కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రస్తుతం ఈ సర్వే ఫలితాలు ఆంధ్ర రాజకీయాలలో వైరల్ గా మారాయి.