Nimmagadda Ramesh : ఉన్నట్లుండి ఏంటీ ఈ వింత పరిణామం.. వైఎస్ జగన్ కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ సరండర్ అయినట్లేనా?
Nimmagadda Ramesh : ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయమై దాదాపు ఏడాది కాలంకు పైగా ప్రభుత్వం మరియు ఎస్‌ఈసీ మద్య వివాదం కొనసాగుతుంది. గత ఏడాది మార్చిలో ఎన్నికలను అర్థాంతరంగా నిలిపి వేయడంతో ఆవేశంతో ఊగిపోయిన జగన్ మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన హయాంలో అసలు ఎన్నికలకు వెళ్ల కూడదు అంటూ నిర్ణయించుకున్నాడు. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కోర్టుల చుట్టు తిరిగి తన ఉద్యోగం ఎలా తెచ్చుకున్నాడో ఎన్నికలకు అనుమతులు కూడా అలాగే తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయితీ ఎన్నికల సమయంలో వైకాపా వారికి నిమ్మగడ్డ చుక్కలు చూపిస్తాడని అంతా భావించారు. కాని అనూహ్యంగా నిమ్మగడ్డ రమేష్ దూకుడుగా వ్యవహరించడం లేదు.
Nimmagadda Ramesh : వైకాపా నాయకుల తీరుతో సైలెంట్..
కొందరు వైకాపా నాయకులు మొదటి నుండి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. కొందరు అయితే ఏకంగా కొట్టేస్తాం చంపేస్తాం అంటూ ప్రకటనలు చేశారు. దాంతో నిమ్మగడ్డ వారిని మొదట కౌంటర్ చేసేందుకు ప్రయత్నించడం, ఫిర్యాదు ఇవ్వడం చేశారు. గవర్నర్ కాని మరెవ్వరైనా కాని వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా కనిపించడం లేదు. దాంతో నిమ్మగడ్డ రమేష్ వైకాపా నాయకుల తీరుపై సైలెంట్ అయ్యాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం విషయంలో నిమ్మగడ్డ రమేష్ నుండి వైకాపా కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాత్రం పంచాయితీ ఎన్నికలు జరుగుతున్నాయి.
అధికారులతో నవ్వుతూ కులాసా చర్చలు..
ఒక ముఖ్యమంత్రి హయాంలో పని చేస్తున్న సమయంలో వారి ప్రభుత్వంకు తగ్గట్లుగా మారిపోయి వారికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం కాని వారికి సంబంధించినంత వరకు అన్ని విషయాల్లో సమర్థించడం కాని చేయాల్సి ఉంటుంది. కాని వైఎస్ జగన్ పై మాత్రం నిమ్మగడ్డ ఆ దృష్టితో ఇన్నాళ్లు లేడనే చెప్పాలి. ఒక రాజకీయ ప్రత్యర్థి మాదిరిగానే వైఎస్ జగన్ ను నిమ్మగడ్డ రమేష్ చూశాడు అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. మార్చి చివరితో నిమ్మగడ్డ పదవి కాలం ముగుస్తుంది. ఇలాంటి సమయంలో అధికారులతో సక్యతగా ఉండటం మరియు ప్రభుత్వంకు సరండర్ అయ్యి పోవడం మంచిదనే ఉద్దేశ్యంతో నిమ్మగడ్డ ఇలా కూల్ అయ్యాడని, అధికారులతో నవ్వుతూ కులాసా చర్చలు జరుపుతున్నాడు అంటున్నారు. ఈ పరిణామంతో వైకాపా ఫుల్ హ్యాపీగా ఉంది.