Alla Ramakrishna Reddy : మంగళగిరి నుంచి నో టికెట్.. ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలో ఉంచకపోవడానికి కారణం అదేనా?

Authored By Breaking News 2 | The Telugu News | Published on: August 26, 2023, 11:00 am

Alla Ramakrishna Reddy : ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు 2019 ఎన్నికల సమయంలో మారుమోగిపోయింది. దానికి కారణం.. టీడీపీ యువనేత నారా లోకేష్ ఈయన పోటీగా టీడీపీ నుంచి పోటీ చేయడం. ఎలాగైనా నారా లోకేష్ గెలుపు కోసం మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేతలు తెగ ప్రయత్నాలు చేశారు కానీ.. ఆళ్లను ఓడించలేకపోయారు. కానీ.. ఆళ్ల గెలిచింది కూడా బోటాబోటి మెజారిటీతో. అంత భారీ మెజారిటీ కూడా కాదు. కానీ.. నారా లోకేష్ ను అయితే ఓడించాడు కదా.

నిజానికి 2014, 2019 ఎన్నికల్లో రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో అయితే జస్ట్ లో ఎమ్మెల్యే అయ్యాడు. 12 ఓట్ల తేడాతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఇక.. 2019 ఎనికల్లో కూడా నారా లోకేష్ తో పోటీ పడి కేవలం 5000 ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. అందుకే ఆయన గెలుపేమీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు. ఇవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. వైసీపీ చేయించిన సర్వే నివేదికలో పలు కీలక నిజాలు బయటపడ్డాయట. అక్కడ యాంటీ ఇంకెబెన్సీ ఎక్కువగా ఉందట.ఒకవేళ ఆళ్లను పోటీ చేయనీయకుండా పక్కన పెట్టేస్తారా? అనేది స్పష్టంగా తెలియదు. కానీ.. ఆయన్ను బరిలోకి దింపకుండా ఖాళీగా మాత్రం ఉంచకూడదని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం.. అమరావతి రాజధాని భూకుంభకోణాలను అప్పట్లో ఆయన వెలికితీశారు. దాని వల్ల టీడీపీకి చాలా సమస్యలు వచ్చాయి. అలాగే.. జగన్ కి కూడా ఆయన ఆప్తమిత్రులు.

no ticket to alla ramakrishna reddy from mangalagiri

no ticket to alla ramakrishna reddy from mangalagiri

Alla Ramakrishna Reddy : ఆళ్లను పోటీ చేయనీయకుండా పక్కన పెట్టేస్తారా?

అందుకే.. ఆళ్లను మంగళగిరి టికెట్ ఇవ్వకున్నా.. బాపట్ల టికెట్ ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారట. ఎలాగూ బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి మీద ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే.. ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆళ్లను బాపట్ల బరిలో దించేందుకు వైసీపీ హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Ration Card : రేషన్ కార్డు ఉన్న మహిళలకు రేవంత్ ప్ర‌భుత్వం అదిరే గుడ్‌న్యూస్..!"

  2. "Gold Rate Today : పసిడి ప్రియులకు మరో షాక్.. 25 నవంబర్ 2026 మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. వెండి మాత్రం తగ్గింది!"

  3. "Rashmi Gautam : రష్మితో లిప్‌లాక్ కావాలన్న కమెడియన్.. బుల్లెట్ భాస్కర్ కౌంటర్‌..!"

  4. "Chicken Shop Business : చికెన్ షాప్ పెడితే లాభమా.. న‌ష్ట‌మా..1 కిలోకు ఎంత మిగులుతుందంటే? అసలు లెక్కలు ఇవే!"

  5. "Today Horoscope : 25 నవంబర్ 2026 బుధ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు..!"

  6. "Huzurnagar News : నిరుద్యోగులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు.. రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు"

  7. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp