RGV : ఒకసారి డాక్టర్ కి చూపించుకొండి అంటూ లోకేష్ పై ఆర్జీవి ఫైర్.. వీడియో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RGV : ఒకసారి డాక్టర్ కి చూపించుకొండి అంటూ లోకేష్ పై ఆర్జీవి ఫైర్.. వీడియో !!

 Authored By sekhar | The Telugu News | Updated on :25 August 2023,4:00 pm

RGV : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం ఏలూరు జిల్లాలో సాగుతుంది. ఇప్పటికే దాదాపు 200 రోజులలో 2500 కిలోమీటర్లకు పైగా నడిచిన లోకేష్ త్వరలో.. గమ్యస్థానానికి చేరుకోనున్నారు. మరో వంద రోజులపాటు పాదయాత్ర జరగనున్నట్లు సమాచారం. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని లోకేష్ భావిస్తున్నారు. అయితే ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అడ్డుపడుతుంది. మరోపక్క సినిమా షూటింగ్లకు అనుమతులు ఇస్తుంది. థర్డ్ గ్రేడ్ సినిమాలు తీసే.. దర్శకుడు ఆర్జీవి లాంటివారికి అనుమతులు ఇస్తూ ఉంది. దీంతో లోకేష్ చేసిన వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆర్జీవి ఫైర్ అయ్యారు. నేను సినిమా రంగంలో నా స్వతహాగా ఎదిగాను. హిట్లు తీశాను ఫ్లాప్ లు తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద రాజకీయ నేత కొడుకు. అయితే నాతో పోలిస్తే మీకు మీరుగా స్వతహాగా చేసింది చూస్తే నాకు ఏమీ కనిపించడం లేదు. మీరు ఒక రాజకీయ నేత. మీరు చేశా ర్యాలీలకు చాలామంది వస్తారు దానికి ఎందుకు అనుమతులు ఇవ్వలేదు అనేది నాకు అనవసరం. సినిమా షూటింగ్ అనేది మామూలు విషయం. వందల షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దానికి ప్రభుత్వం నుండి పర్మిషన్ రాకపోవడం అనే సంఘటనలు అసలు ఉండవు.

rgv comments on Nara lokesh

rgv comments on Nara lokesh

ఒకవేళ ఉంటే చాలా బలమైన కారణం ఉంటుంది. కానీ మీరు చేసే కార్యక్రమాలు ఏ ఎజెండాతో చేస్తున్నారనేది ప్రభుత్వాలు గమనిస్తాయి అంటూ ఆర్జీవి.. తనపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు భారీగా కౌంటర్ ఇచ్చారు. మీరు ఇటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే మీ ఆరోగ్యంలో ఏదో మార్పు వచ్చినట్లుంది. దయచేసి ఒకసారి డాక్టర్ కి చూపించు కొండి అని సెటైర్లు వేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది