Chandrababu : ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఓ తాత చెప్పిన కాకి కథ.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: June 25, 2023, 12:00 pm

Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. దీంతో వెబ్ మీడియా ఛానల్స్ అదేవిధంగా ప్రధాన పార్టీలు ఎవరికి వారు ప్రజల నాడిని తెలుసుకోవడానికి రకరకాల సర్వేలు ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఓ వెబ్ మీడియా ఛానల్ ప్రజల నాడిని తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కాకి కథ చెప్పడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంది.

ఆ తాత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని తన అభిప్రాయం తెలిపారు. ప్రతి నెల మొదటి తారీకు ఉదయమే వాలంటీర్లు తమకి పెన్షన్ అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల అవసరతలు తీరుస్తున్నాడు అని వివరించారు. గతంలో మాదిరిగా ప్రజాధనాన్ని దోచుకునే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదని.. ప్రజలకు అద్భుతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడికి వైయస్ జగన్ అండదండగా నిలబడి పరిపాలన అందిస్తున్నాడని చెప్పుకొచ్చారు.

 old man hilarious comments chandrababu

old man hilarious comments chandrababu

ఈ క్రమంలో ఆ వృద్ధుడు కాకి కథ చెప్పడం జరిగింది. చంద్రబాబు పరిపాలనలో మధ్యలో అధికారులు మరియు నాయకులు చాలా దారుణంగా అవినీతి చేశారని ఆ వృద్ధుడు వాపోయారు. ఏది ఏమైనా 2024 ఎన్నికలలో మళ్లీ వైయస్ జగన్ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp